e-Vitara EV: మారుతి ఈ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే ? ధర, రేంజ్ పూర్తి వివరాలివే
ధర, రేంజ్ పూర్తి వివరాలివే

e-Vitara EV: మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాను ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ కారు జపాన్, యూరప్‌తో పాటు దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. మారుతి ఇప్పటికే ఎగుమతులపై మొదట దృష్టి పెడుతుందని చెప్పింది. ఆ తర్వాత ఈ-విటారాను భారతదేశంలో లాంచ్ చేస్తారు. అయినప్పటికీ, రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరాలో లోపం, అనేక ఇతర సమస్యల కారణంగా గ్లోబల్ షిప్‌మెంట్‌లో కూడా ఆలస్యం జరిగింది. కంపెనీ ఇప్పటివరకు దాని లాంచ్‌కు సంబంధించిన ఖచ్చితమైన సమయాన్ని ప్రకటించలేదు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, అంటే మార్చి 2026కు ముందు మారుతి ఈ-విటారా లాంచ్ అవుతుందని ధృవీకరించింది.
భారతదేశంలో మారుతి ఈ-విటారా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజి జెడ్‌ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి కార్లతో పోటీ పడుతుంది. దీని అధికారిక ధర రాబోయే నెలల్లో ప్రకటించనుంది. కానీ దీని ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షల నుండి ఉంటుందని అంచనా. దీని ఉత్పత్తి సుజుకి గుజరాత్ ఫ్యాక్టరీలో జరుగుతుంది.
ఈ ఎస్‌యూవీ హీర్టెక్ట్-ఇ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి 49kWh, మరొకటి పెద్ద 61kWh ప్యాక్. ఈ బ్యాటరీలలో BYD నుండి తీసుకున్న LFP (లిథియం ఐరన్-ఫాస్ఫేట్) బ్లేడ్ సెల్స్‌ను ఉపయోగించారు. 61kWh వేరియంట్‌లో డ్యుయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్ ఉంటుంది. దీని ట్రైల్ మోడ్ లో మారుతి AllGrip-e AWD సిస్టమ్ ఆటోమెటిక్‌గా పట్టు కోల్పోతున్న టైర్లకు బ్రేక్ వేస్తుంది. పట్టు ఉన్న టైర్లకు పవర్‌ను పంపుతుంది. అంటే ఇది ఒక లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్ లాగా పనిచేస్తుంది.
మారుతి సుజుకి ఈ-విటారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని పేర్కొంది. ఇది బహుశా పెద్ద 61kWh బ్యాటరీ ప్యాక్, డ్యుయల్-మోటార్ ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌తో సాధ్యమవుతుంది. 49kWh బ్యాటరీతో సింగిల్ మోటార్ వస్తుంది, ఇది 144bhp పవర్ ని అందిస్తుంది. 61kWh బ్యాటరీతో కూడిన సింగిల్ మోటార్ వేరియంట్ 174bhp పవర్ అందిస్తుంది. రెండు వేరియంట్‌లలో 189Nm టార్క్ లభిస్తుంది. ఇక AllGrip-e AWD వేరియంట్‌లో అదనంగా 65bhp మోటార్ ఉంటుంది. దీంతో మొత్తం పవర్ 184bhpకి, టార్క్ 300Nmకి పెరుగుతుంది.
