దీపావళికి ముందే రూ.47,000 వరకు డిస్కౌంట్

Maruti Suzuki Ertiga : భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీ మోడళ్లలో మారుతి సుజుకి ఎర్టిగా ఒకటి. ఎరీనా రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించబడే ఈ కారుకు గత కొన్ని ఏళ్లుగా డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో 2025 సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త జీఎస్‌టీ పన్ను మార్పుల కారణంగా మారుతి సుజుకి ఈ ఎంపీవీ ధరలను భారీగా తగ్గించింది. జీఎస్‌టీ కోతతో, మారుతి సుజుకి ఎర్టిగా అన్ని వేరియంట్ల ధరలు రూ.47,000 వరకు చౌకగా మారాయి. పండుగ సీజన్ ముందు వచ్చిన ఈ ధర తగ్గింపు కస్టమర్లకు గొప్ప శుభవార్త.

జీఎస్‌టీ తగ్గింపు కారణంగా మారుతి సుజుకి ఎర్టిగా ధరల్లో వేరియంట్‌ను బట్టి రూ.32,000 నుండి రూ.47,000 వరకు కోత పడింది. జీఎస్‌టీ తగ్గింపుకు ముందు రూ.9.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉన్న ఎర్టిగా ప్రారంభ ధర, ఇప్పుడు రూ.8.80 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. గతంలో రూ.13.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర, ఇప్పుడు రూ.12.94 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది.

జీఎస్‌టీ 2.0 తగ్గింపు తర్వాత మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల కొత్త ధరలు, తగ్గింపు వివరాల్లోకి వెళితే.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8.80 లక్షలు, రూ.11.83 లక్షల మధ్య ఉన్నాయి. పాత ధరలు రూ.9.12 లక్షలు, రూ.12.25 లక్షల మధ్య ఉండేవి. ఈ వేరియంట్లపై రూ.32,000 నుండి రూ.42,000 వరకు తగ్గింపు లభించింది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు రూ.11.20 లక్షలు, రూ.12.94 లక్షల మధ్య ఉన్నాయి. పాత ధరలు రూ.11.61 లక్షలు, రూ.13.41 లక్షల మధ్య ఉండేవి. ఆటోమేటిక్ వేరియంట్లపై తగ్గింపు పరిధి రూ.41,000 నుండి రూ.47,000 వరకు ఉంది. ఇది అత్యధిక తగ్గింపు.

మారుతి సుజుకి ఎర్టిగా కేవలం పెట్రోల్, పెట్రోల్-సీఎన్‌జీ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. ఎర్టిగా VXi CNG, ZXi CNG ట్రిమ్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. జీఎస్‌టీ తగ్గింపు తర్వాత, సీఎన్‌జీ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.10.76 లక్షలు, రూ.11.83 లక్షల మధ్య ఉన్నాయి. సీఎన్‌జీ మోడళ్లపై రూ.40,000 నుండి రూ.42,000 వరకు తగ్గింపు లభించింది. ఈ ధర తగ్గింపుతో మారుతి సుజుకి ఎర్టిగా, ఎంపీవీ సెగ్మెంట్‌లో వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story