ఈ హ్యాబ్రిడ్ ఎస్‌యూవీని అస్సలు మిస్సవద్దు

Maruti Suzuki Grand Vitara : సంవత్సరం చివరిలో కొత్త ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన డీల్‌గా లభించవచ్చు. డిసెంబర్ 2025 నెలలో మారుతి తమ ఈ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై ఏకంగా రూ.2.19 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. నెక్సా షోరూమ్‌ల పరిధిలో ఇది ప్రస్తుతానికి అతిపెద్ద ఇయర్-ఎండ్ బెనిఫిట్గా నిలుస్తోంది. మైలేజ్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు ఇంత పెద్ద డిస్కౌంట్ లభించడం వల్ల, ఈ ఎస్‌యూవీ కొనుగోలుదారుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ప్రస్తుతం నెక్సా షోరూమ్‌లలో అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్న కారుగా మారింది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్‌లో కేవలం క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా, లాంగ్ టర్మ్ వ్యాల్యూ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ డిస్కౌంట్ ప్యాకేజీలో ముఖ్యంగా చెప్పుకోవలసింది 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉచితంగా లభించడం. సాధారణంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ కోసం అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.. కానీ ఈ ఆఫర్ కింద కస్టమర్‌లకు ఈ ప్రయోజనం ఉచితంగా దక్కుతోంది. దీనివల్ల దీర్ఘకాలంలో మెయింటెనెన్స్, రిపేర్ ఖర్చుల గురించి ఆందోళన చాలా వరకు తగ్గుతుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా దాని అద్భుతమైన మైలేజ్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ టెక్నాలజీ (సుమారు 27 కిమీ మైలేజ్), స్ట్రాంగ్ రోడ్ ప్రజెన్స్, సౌకర్యవంతమైన క్యాబిన్ కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఎస్‌యూవీ సిటీ, హైవే ప్రయాణాలకు రెండింటికీ అనుకూలంగా ఉండేలా బ్యాలెన్సుడ్ ప్యాకేజీని అందిస్తుంది. మారుతి గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ.10.76 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్‌కు రూ.19.72 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా వంటి వేరియంట్లు, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లపై ఆధారపడి ఉంటాయి.

గమనిక: ఇక్కడ పేర్కొన్న రూ. 2.19 లక్షల వరకు ఉన్న డిస్కౌంట్ అనేది కారు వేరియంట్, స్టాక్ లభ్యత, మీరు కొనుగోలు చేసే సిటీ ఆధారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ దగ్గరలోని నెక్సా డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story