Maruti : హ్యుందాయ్ క్రెటాకు షాక్..మారుతి కొత్త గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్!
మారుతి కొత్త గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్!

Maruti : హ్యుందాయ్ క్రెటాతో గట్టి పోటీ పడుతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఇప్పుడు మరింత స్టైలిష్‌గా వచ్చింది. మారుతి సుజుకి తన నెక్సా రిటైల్ ఛానెల్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. స్టైల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్ల కోసం ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. నెక్సా ఛానెల్ ద్వారా అమ్ముడవుతున్న ఈ ఎస్‌యూవీ కేవలం 32 నెలల్లోనే 300,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది.
ఈ కొత్త ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్, గ్రాండ్ విటారా టాప్-ఎండ్ ఆల్ఫా+ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన మ్యాట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ పెయింట్ ఫినిష్ ఇచ్చారు. ఇది స్టాండర్డ్ మోడల్ నుండి డిఫరెంటుగా కనిపిస్తుంది. అలాగే, లోపలి భాగంలో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, ఫాక్స్ లెదర్ అప్హోల్‌స్ట్రీ, ప్రీమియం లుక్‌ను ఇచ్చే షాంపైన్ గోల్డ్ యాక్సెంట్స్ ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కొత్త ఎడిషన్‌లో స్టాండర్డ్ గ్రాండ్ విటారా ఆల్ఫా+ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫాక్స్ లెదర్ ఉన్న వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. అలాగే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లారియన్ సౌండ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.
సేఫ్టీ కోసం ఈ ఎడిషన్‌లో 360-డిగ్రీ వ్యూ కెమెరా,హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి. దీనితో పాటు, రిమోట్ యాక్సెస్ కోసం సుజుకి కనెక్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికొస్తే, ఈ కారులో 1.5 లీటర్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంది. దీనిని ఇంటెలిజెంట్ హైబ్రిడ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ మొత్తం 114 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ మైలేజ్ 27.97 కి.మీ/లీటర్ అని మారుతి సుజుకి చెబుతోంది. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజ్.
