Maruti Suzuki : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల కంపెనీ మారుతి సుజుకి, రాబోయే పండగ సీజన్ లోపు మార్కెట్లో భారీ ప్లాన్ చేస్తోంది. తమ మోస్ట్ పాపులర్ మోడల్స్ అయిన బ్రెజ్జా ఎస్‌యూవీ, బాలెనో హ్యాచ్‌బ్యాక్ కార్లను సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం రోడ్లపై చివరి దశ టెస్టింగ్‌లో ఉన్నాయి. చిన్న చిన్న డిజైన్ మార్పులు, అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ కార్లు.. మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్ వంటి బలమైన కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

టర్బో ఇంజన్‌తో వస్తున్న కొత్త బ్రెజ్జా 2026

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో రాబోతున్న బిగ్గెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. ఇందులో మారుతి ఫ్రాంక్స్ కార్ల నుంచి సేకరించిన 1.0 లీటర్, త్రీ-సిలిండర్ బూస్టర్‌జెట్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ 100 PS గరిష్ట పవర్‌ను, 148 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి సరికొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్‌జీ (CNG) ఇంజన్ ఆప్షన్లు కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఈ కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చే జూలై నెలలోనే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బ్రెజ్జాలో అప్‌డేట్ అయిన ఫీచర్లు

కొత్త 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారు లోపల కస్టమర్ల కోసం 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. కారు కేబిన్ లోపల సరికొత్త సీట్ అప్హోల్స్టరీ, కొత్త ట్రిమ్స్‌ను డిజైన్ చేశారు. బయటి లుక్ విషయానికి వస్తే.. ఈ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ గల ఫాగ్ ల్యాంప్స్, లావుపాటి సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్, సరికొత్త స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.

సన్‌రూఫ్‌తో మెరిసిపోనున్న కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్

మరోవైపు, మారుతి బాలెనో 2026 ఫేస్‌లిఫ్ట్ కారును కూడా భారీ మార్పులతో తీసుకువస్తున్నారు. ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో ప్రస్తుతం ఉన్న 90bhp పవర్ ఇచ్చే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించనున్నారు. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉంటాయి. లీకైన స్పై షాట్స్ ప్రకారం.. ఈ కారు ముందు భాగంలో సరికొత్త డిజైన్ గల గ్రిల్, కొత్త బంపర్‌ను ఇచ్చారు. అయితే, ఇందులో ఉండే ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, బూమరాంగ్ షేప్ డీఆర్‌ఎల్‌లు (DRLs) పాత మోడల్ లాగే ఉండనున్నాయి. ఈ కారు ఆగస్టు నుంచి అక్టోబర్ 2026 మధ్య మార్కెట్లోకి విడుదల కానుంది.

బాలెనో కేబిన్‌లో లగ్జరీ హంగులు

కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కారు లోపల కంపెనీ మొట్టమొదటిసారిగా సింగిల్-పేన్ సన్‌రూఫ్, క్యాబిన్ అందాన్ని పెంచే యాంబియంట్ లైటింగ్ ఫీచర్లను అందించబోతోంది. వీటితో పాటు 9-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, కలర్‌ఫుల్ ఎమ్ఐడీ స్క్రీన్ ఉన్న అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి పాపులర్ ఫీచర్లను పాత మోడల్ లాగే ఇందులోనూ కొనసాగిస్తున్నారు. లుక్, ఫీచర్ల పరంగా ఈ రెండు కార్లు కస్టమర్లను పండగ సీజన్ లోపు భారీగా ఆకట్టుకోనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story