భారత్‌లో 32 లక్షల మంది దీనినే వాడుతున్నారు

WagonR : భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా ఉన్న మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఈ కారు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది. తక్కువ ధర, ఎక్కువ స్థలం, మంచి మైలేజ్‌తో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ కోటి యూనిట్ల అమ్మకాల మార్క్‌ను చేరుకోవడానికి 31 సంవత్సరాలు పట్టింది. ఈ కారును సుజుకి సంస్థ మొట్టమొదటగా 1993లో జపాన్‌లో లాంచ్ చేసింది. ఆ తర్వాత 1999లో ఈ కారు భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీని ప్రత్యేకమైన టాల్-బాయ్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు భారత్‌లో దీనికి మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి.

వ్యాగన్‌ఆర్ విజయం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. తక్కవ ధరలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షలు. అంతేకాకుండా ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. ఇది భారత్‌లో కారు కొనుగోలుదారులకు ఒక ముఖ్యమైన అంశం. టాల్-బాయ్ డిజైన్ కారణంగా కారులో ఎక్కువ హెడ్ రూమ్, లెగ్ రూమ్ లభిస్తుంది. సిటీ రోడ్ల మీద, చిన్న ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా వ్యాగన్‌ఆర్ అమ్మకాలలో భారత్ వాటా చాలా ఎక్కువ. ఇది భారతదేశంలో ఎల్లప్పుడూ బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది. గతేడాది భారతదేశంలో వ్యాగన్‌ఆర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటికి దేశంలో 3.2 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి.

భారతదేశంలో వ్యాగన్‌ఆర్‌ను ఇప్పటివరకు మూడుసార్లు అప్‌డేట్ చేశారు. చివరిసారిగా 2019లో దీనిని కొత్త అవతారంలో లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్‌లో 1.0-లీటర్, 1.2-లీటర్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, సీఎన్‌జీ (CNG) వేరియంట్ కూడా ప్రైవేట్, కమర్షియల్ కస్టమర్ల మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. సుజుకి సంస్థ జపాన్, భారత్‌తో పాటు మొత్తం 75 దేశాల్లో వ్యాగన్‌ఆర్‌ను విక్రయిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story