ఈ సారి ఏకంగా 8 కొత్త ఎస్యూవీలు

Maruti Suzuki : భారతీయ కార్ల మార్కెట్‌లో ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో తమ వాటాను కోల్పోతున్న మారుతి సుజుకి, మళ్లీ తన పాత వైభవాన్ని సాధించడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే 5 నుంచి 6 సంవత్సరాలలో భారతదేశంలో ఏకంగా 8 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేయనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి ప్రకటించారు. దీని ద్వారా పోటీదారుల నుంచి కోల్పోయిన తమ 50% మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి, జపాన్ మొబిలిటీ షో సందర్భంగా భారతదేశంలో తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. రాబోయే 5 నుంచి 6 సంవత్సరాలలో భారత మార్కెట్‌లో 8 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేయనున్నట్లు సుజుకి ప్రకటించారు. పెరుగుతున్న పోటీ కారణంగా కోల్పోయిన తమ పాత 50% మార్కెట్ వాటాను తిరిగి సాధించడమే ఈ భారీ ప్రణాళిక వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో పోటీ చాలా గట్టిగా ఉందని, గత నాలుగు దశాబ్దాలలో ఇది సుజుకికి అత్యంత సవాలుతో కూడిన కాలమని తోషిహిరో సుజుకి పేర్కొన్నారు. భారతదేశం సుజుకికి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఇక్కడ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ద్వారా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మారుతి సుజుకి చాలా కాలంగా దేశంలో చిన్న కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారులు ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపడం వల్ల మారుతి మార్కెట్ వాటాపై ఒత్తిడి పెరిగింది.

అందుకే కంపెనీ ఇప్పుడు తమ ఎస్‌యూవీల శ్రేణిని వేగంగా పెంచడంపై దృష్టి పెట్టింది. ప్రీమియం, హై-గ్రోత్ విభాగాలలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని, అదే సమయంలో చిన్న కార్ల విభాగంలో తమ ఆధిపత్యం కొనసాగించాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది. మారుతి సుజుకి ఇటీవల భారత మార్కెట్‌లో విడుదల చేసిన కొత్త ఎస్‌యూవీ విక్టోరిస్ కు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ విడుదలైన నెల రోజుల్లోనే 25,000కు పైగా బుకింగ్‌లను నమోదు చేసింది.

పండుగ సీజన్ ప్రారంభం కావడంతో, కంపెనీ లక్ష్యం ప్రకారం ఇప్పటికే ఈ కారు మొదటి యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేయడం మొదలుపెట్టింది. విక్టోరిస్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం 21 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఎస్-సీఎన్‌జీ అనే మూడు పవర్‌ట్రైన్ ఎంపికలతో వస్తుంది. అంతేకాకుండా, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story