సిటీలో నడిపితే ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలుసా ?

Maruti Victoris : మారుతి సంస్థకు చెందిన సరికొత్త విక్టోరిస్ కేవలం 3 నెలల్లోనే భారత మార్కెట్‌లో తన సత్తా చాటుకుంది. విడుదలైన మూడు నెలల్లోనే ఈ కారు 30,057 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనికి కారణం దీని ఆకర్షణీయమైన డిజైన్, సేఫ్టీ, ఇంటీరియర్, సీఎన్‌జీ సిలిండర్ కింద అమర్చడం వంటి ప్రత్యేకతలు. ఈ కారు నాలుగు పవర్‌ట్రెయిన్ ఎంపికల్లో లభిస్తుంది. ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్‌జీ-మాన్యువల్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) తో కూడిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. కంపెనీ విక్టోరిస్ ఏడబ్ల్యూడీ మోడల్‌కు 19.07 కి.మీ/లీ మైలేజీ వస్తుందని చెబుతోంది. అయితే, రియల్ వరల్డ్ టెస్టుల్లో ఇది ఎంత మైలేజీ ఇచ్చిందో చూద్దాం.

ఆటోకార్ ఇండియా సంస్థ మారుతి విక్టోరిస్ ఏడబ్ల్యూడీ మోడల్‌ను తీసుకొని రియల్ టైమ్ మైలేజ్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్‌లో సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసినప్పుడు విక్టోరిస్ మైలేజ్ కేవలం 8.93 కి.మీ/లీ మాత్రమే నమోదైంది. హైవేపై డ్రైవింగ్ చేసినప్పుడు మైలేజ్ కొంచెం మెరుగుపడి 14.62 కి.మీ/లీ గా నమోదైంది.సిటీ, హైవే మైలేజ్‌ను కలిపి చూస్తే విక్టోరిస్ ఏడబ్ల్యూడీ సగటున 11.78 కి.మీ/లీ మైలేజ్ మాత్రమే ఇచ్చింది. కంపెనీ చెప్పిన 19.07 కి.మీ/లీ మైలేజీతో పోలిస్తే, రియల్ టైమ్ టెస్టులో విక్టోరిస్ మైలేజ్ ఏకంగా 7.29 కి.మీ/లీ తక్కువగా రావడం గమనార్హం.

మైలేజ్ ఇంత తక్కువగా రావడానికి కొన్ని కారణాలను నిపుణులు తెలిపారు. విక్టోరిస్ ఏడబ్ల్యూడీ మోడల్ బరువు దాని ఫ్రంట్-వీల్-డ్రైవ్ మోడల్ కంటే సుమారు 100 కిలోలు ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు బరువు కారణంగానే ఏఆర్ఏఐ మైలేజ్ కూడా 1.99 కి.మీ/లీ తగ్గి 19.07 కి.మీ/లీకి చేరింది.

టెస్ట్ సమయంలో హైవేపై ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుంచి సిటీలో డ్రైవింగ్ పూర్తయ్యేసరికి 37 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. పరిసర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, కారు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్ ఇంజిన్‌ను ఎక్కువసేపు ఆపలేదు. దీని వలన సిటీ మైలేజ్ గణనీయంగా తగ్గింది. విక్టోరిస్ ఏడబ్ల్యూడీ, ఎఫ్‌డబ్ల్యూడీ మోడళ్లు రెండూ 103 హెచ్‌పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story