వెన్యూ, సోనెట్‎ల పీచమణచిన విక్టోరిస్

Maruti Victoris : మారుతీ సుజుకీ నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్ ఇప్పుడు ఇండియన్ రోడ్లపై సెన్సేషన్ సృష్టిస్తోంది. 2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ కారు, అతి తక్కువ కాలంలోనే టాప్ 10 కార్ల జాబితాలోకి చేరిపోయింది. గత నెల అంటే 2026 జనవరిలో ఏకంగా 15,240 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి దిగ్గజ కార్లను వెనక్కి నెట్టేసింది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ, మారుతీ సంస్థ విక్టోరిస్‌పై మొదటిసారిగా భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

ఏ వేరియంట్‌పై ఎంత డిస్కౌంట్?

మారుతీ సుజుకీ తన విక్టోరిస్ మోడళ్లపై వేరియంట్లను బట్టి భారీ తగ్గింపులను అందిస్తోంది. ఎంట్రీ లెవల్ LXi, VXi (పెట్రోల్ + సీఎన్‌జీ) వేరియంట్లపై రూ.30,000 కస్టమర్ ఆఫర్, రూ.20,000 లాయల్టీ బోనస్‌తో కలిపి మొత్తం రూ.50,000 వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇక మిడ్ మరియు టాప్ వేరియంట్లు ZXi, ZXi+ లపై రూ.61,000 వరకు ఆఫర్ ఉంది. అన్నింటికంటే ఎక్కువగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై ఏకంగా రూ.78,000 (రూ.48,000 కస్టమర్ ఆఫర్ + రూ.30,000 లాయల్టీ బోనస్) వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది స్టాక్ ఉన్నంత వరకే వర్తిస్తుంది కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే షోరూమ్‌కి వెళ్లడం మంచిది.

విక్టోరిస్ ఎస్‌యూవీని మారుతీ తన ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తోంది. ఇది గ్రాండ్ విటారాకు మరింత అందుబాటు ధరలో ఉండే వెర్షన్‌గా వచ్చింది. ఇందులో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ (103hp), 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (116hp), సీఎన్‌జీ వెర్షన్ (89hp). లోపల 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డాల్బీ అట్మాస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. దీని డిజైన్ రాబోయే ఈ-విటారా ఎలక్ట్రిక్ కారును పోలి ఉండి, 18 ఇంచుల అలాయ్ వీల్స్‌తో చాలా గంభీరంగా కనిపిస్తుంది.

మారుతీ కార్లు అంటే సేఫ్టీ తక్కువ అనే మాటను విక్టోరిస్ చెరిపివేసింది. ఈ కారుకు భారత్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ లభించింది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ ADAS లెవల్ 2 టెక్నాలజీని కూడా అందించారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు, మధ్యతరగతి ఫ్యామిలీలకు ఒక పర్ఫెక్ట్, సేఫ్ ఛాయిస్.

PolitEnt Media

PolitEnt Media

Next Story