డిజైర్ తర్వాత మరో కారు ప్రపంచ రికార్డు

Maruti Victoris : భారతదేశంలో ఇప్పుడు స్ట్రాంగ్, సేఫ్టీ కార్లకు డిమాండ్ పెరిగింది. ప్రజలు కారు కొనేటప్పుడు సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కంపెనీలు కూడా తమ కార్లను బలోపేతం చేసుకుంటున్నాయి. గతంలో నాసిరకం కార్లకు పేరుపడిన మారుతి కూడా తన విధానాన్ని మార్చుకుంది. కార్లలో పవర్ఫుల్ ఫీచర్లను ఇవ్వడం మొదలుపెట్టింది. అందుకే మారుతి విక్టోరిస్ లాంచ్ అవ్వగానే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కారును మారుతి ఇటీవల విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది.

డిజైర్ తర్వాత రెండవ కారు

మారుతి సుజుకి విక్టోరిస్ ఇండియా ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన తర్వాత ఇప్పుడు గ్లోబల్ ఎన్‌క్యాప్లో కూడా 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందిన మారుతి సుజుకి రెండవ కారు ఇది. మొదటి కారు మారుతి సుజుకి డిజైర్.

లెవెల్-2 ఏడీఏఎస్

ఈ స్ట్రాంగ్ క్రాష్ స్కోర్‌కు కారణం ఇందులో ఉన్న కంప్లీట్ సేఫ్టీ ఫీచర్లు. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించారు. ఇది కాకుండా ఈ ఎస్‌యూవీలో ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మారుతి విక్టోరిస్‌లో లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్ ఇచ్చారు.

విక్టోరిస్ సేఫ్టీ ఫీచర్లు

విక్టోరిస్‌లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కర్వ్ స్పీడ్ అడ్జస్ట్‌మెంట్, లేన్-కీప్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రియర్-క్రాస్ ట్రాఫిక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. నేటి సేఫ్టీ ప్రమాణాల ప్రకారం, ప్రమాదాన్ని నివారించడం లేదా దాని తీవ్రతను తగ్గించడం చాలా ముఖ్యం. ఈ ఆలోచనతోనే విక్టోరిస్‌ను రూపొందించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story