Victoris vs Creta: భారత మార్కెట్లో కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మైలేజ్ పరంగా రెండు కార్లు పోటీపడుతున్నాయి. కారును చూడగానే ఆకట్టుకునే డిజైన్ విషయంలో రెండు ఎస్‌యూవీలు భిన్నమైన శైలిని కలిగి ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా బాల్డ్, మోడర్న్ లుక్‌తో అలరిస్తోంది. ముందు భాగంలో విశాలమైన గ్రిల్, కనెక్టెడ్ ఎల్ఈడీ డిఆర్‌ఎల్‌లు, వెనుక కనెక్టెడ్ టెయిల్ లైట్లతో రోడ్డుపై గంభీరమైన ఐడెంటిటీని ఇస్తుంది. మారుతి సుజుకి విక్టోరిస్ డిజైన్ మరింత మస్క్యులర్, స్పోర్టీ అప్పీల్‌తో కనిపిస్తుంది. సిగ్నేచర్ గ్రిల్, షార్ప్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, అగ్రెసివ్ బాడీ క్లాడింగ్‌తో రఫ్ అండ్ టఫ్ కారు కావాలనుకునే వారిని విక్టోరిస్ బాగా ఆకట్టుకుంటుంది.

ఇంటీరియర్ లగ్జరీ.. ఫీచర్ల హోదా

హ్యుందాయ్ క్రెటా కేబిన్‌లోకి అడుగుపెడితే ఎంతో లగ్జరీ ఫీల్ లభిస్తుంది. 10.25 ఇంచుల డ్యూయల్ స్క్రీన్ సెటప్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ మెంట్ గా మారుస్తాయి. మారుతి సుజుకి విక్టోరిస్ కూడా ఏమాత్రం తీసిపోదు. దీనిలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను పొందుపరిచారు.

ఇంజన్ పవర్.. మైలేజ్ లెక్కలు

ఇంజన్ ఆప్షన్లలో హ్యుందాయ్ క్రెటా విస్తృతమైన ఛాయిస్‌లను ఇస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు మ్యాన్యువల్, ఐవిటి, డిసిటి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి. మారుతి విక్టోరిస్ 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్, 1.5 లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఆప్షన్లతో వస్తుంది. ఏఆర్‌ఏఐ లెక్కల ప్రకారం క్రెటా లీటరుకు 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు ఏకంగా 19.07 నుంచి 28.65 కిలోమీటర్ల అద్భుత మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి విక్టోరిస్ హైబ్రిడ్ బెస్ట్ ఛాయిస్.

సేఫ్టీలో తగ్గేదే లే.. లెవెల్-2 ఏడీఏఎస్

సేఫ్టీ విషయంలో రెండు దిగ్గజ సంస్థలు రాజీపడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, ఆల్-డిస్క్ బ్రేకులు ప్రామాణికంగా లభిస్తున్నాయి. డ్రైవింగ్ సమయంలో ప్రమాదాలను నివారించేందుకు అత్యంత అధునాతన లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీని రెండు కార్లలోనూ అందించడం విశేషం.

Next Story