ఏకంగా రూ.1.21లక్షల డిస్కౌంట్

Maruti Suzuki WagonR : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఈ ఆగస్టు నెలలో వినియోగదారులకు భారీ ఆఫర్లతో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ కారుపై ఏకంగా రూ.1.21 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ భారీ ఆఫర్ వివరాలు, వ్యాగన్‌ఆర్ స్పెసిఫికేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెలలో వ్యాగన్‌ఆర్ కొనుగోలుపై రూ.1.21 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో వివిధ రకాల డిస్కౌంట్లు ఉన్నాయి. 60,790 విలువైన కాంప్లిమెంటరీ కిట్‌, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 40,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్, రూ.25,000 వరకు స్క్రాపేజ్ బోనస్, రూ.5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇలా అన్ని ప్రయోజనాలను కలుపుకుంటే రూ.1.21 లక్షల వరకు మొత్తం ప్రయోజనం లభిస్తుంది. వ్యాగన్‌ఆర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.7.62 లక్షల వరకు ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఎన్నో మంచి ఫీచర్లతో వస్తుంది. నావిగేషన్‌తో కూడిన 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఏఎంటీ మోడల్‌లో హిల్-హోల్డ్ అసిస్ట్, నాలుగు స్పీకర్లు, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఈ కారులో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఎల్‌ఎక్స్ఐ, వీఎక్స్ఐ ట్రిమ్‌లలో సిఎన్‌జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 25.19 కి.మీ, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 24.43 కి.మీ, సిఎన్‌జి వేరియంట్ కిలోకు 34.05 కి.మీ మైలేజీ అందిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story