Maruti : ఇకపై 6 ఎయిర్‌బ్యాగ్‌లు..మారుతి XL6లో పెరిగిన భద్రత
మారుతి XL6లో పెరిగిన భద్రత

Maruti : భారతదేశంలో ఎక్కువ కార్లు అమ్మే మారుతి సుజుకి, తమ XL6 కారును మరింత సురక్షితంగా మార్చింది. ఇకపై XL6 లోని అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. దీనితో ఈ 6 సీట్ల కారులో ప్రయాణించే వారందరూ మరింత సేఫ్‌గా ఉంటారు. ప్రస్తుతానికి XL6 ధర రూ. 11.84 లక్షల నుంచి రూ. 14.99 లక్షల వరకు ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు పెట్టడం వల్ల ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. XL6 లో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్, బ్రేక్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. టాప్ మోడళ్లలో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి.
కారు ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 103 hp పవర్ ను, 137 Nm టార్క్ ను ఇస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో ఈ కారు అందుబాటులో ఉంది. XL6 సీఎన్‌జీ (CNG) ఆప్షన్‌లో కూడా ఉంది, అయితే ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. సీఎన్‌జీలో ఇంజిన్ 88 bhp పవర్, 121 Nm టార్క్ ఇస్తుంది.
* పెట్రోల్ మాన్యువల్: 20.97 కి.మీ/లీటర్ మైలేజ్.
* పెట్రోల్ ఆటోమేటిక్: 20.27 కి.మీ/లీటర్ మైలేజ్.
* సీఎన్‌జీ మాన్యువల్: 26.32 కి.మీ/కిలోగ్రామ్ మైలేజ్.
ఈ అప్‌డేట్ తర్వాత, ఇప్పుడు ఫ్రాంక్స్, ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్ మాత్రమే 6 ఎయిర్‌బ్యాగ్‌లు లేని మారుతి మోడళ్లు. 2025 చివరి నాటికి అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని మారుతి సుజుకి ప్రకటించింది. అంతకుముందు, ఆల్టో K10, సెలెరియో, ఈకో, వ్యాగన్ఆర్ లకు కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు అప్‌డేట్ అయ్యాయి. స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రీమియం కార్లలోనూ ఈ సేఫ్టీ ఫీచర్ ఉంది.
