మహీంద్రా థార్‌పై రూ.2 లక్షల బంపర్ డిస్కౌంట్

Mahindra Thar ROXX: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన థార్ రాక్స్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా థార్ రాక్స్ లోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన AX7L డీజిల్ 4WD మోడల్‌పై గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.1.75 లక్షల నేరుగా క్యాష్ డిస్కౌంట్ కాగా, మరో రూ.25,000 విలువైన యాక్సెసరీలను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. అలాగే, AX7L పెట్రోల్ ఆటోమేటిక్ (AT) వేరియంట్‌పై రూ.1.25 లక్షల క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ.25,000 యాక్సెసరీల ఆఫర్ ఉంది. సాధారణ థార్ 3-డోర్ వేరియంట్లపై కూడా రూ.30,000 నగదు, రూ.20,000 యాక్సెసరీల రూపంలో మొత్తం రూ.50,000 వరకు లబ్ధి చేకూరుతోంది.

ఫీచర్ల పరంగా చూస్తే.. థార్ రాక్స్ బేస్ వేరియంట్ MX1 కూడా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 162hp పవర్, 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 152hp పవర్, 330Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. ఆఫ్‌రోడింగ్ ప్రియుల కోసం ఇందులో స్మార్ట్ అసిస్ట్ (CSA), ఇంటెల్లి టర్న్ అసిస్ట్ (ITA) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. థార్ రాక్స్‌లో కెమెరా ఆధారిత లెవల్-2 ADAS సూట్‌ను అందించారు. దీనితో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, టీపీఎంఎస్ (TPMS), ఈఎస్‌పి (ESP), ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్టులు వంటి భద్రతా ప్రమాణాలను చేర్చారు. ఈ భారీ డిస్కౌంట్లు, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కలయిక వల్ల 2026 ప్రారంభంలో థార్ అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తున్నాయి. కేవలం జనవరి 31 లోపు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story