SUV Update : మార్కెట్‌ను శాసించనున్న సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలు.. ఈ 6 మోడల్స్‌లో భారీ మార్పులు
ఈ 6 మోడల్స్‌లో భారీ మార్పులు

SUV Update : భారతదేశంలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ (4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న ఎస్‌యూవీలు)లో పోటీ మరింత పెరగనుంది. రాబోయే కాలంలో ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఆరు ప్రముఖ మోడళ్లకు భారీ అప్‌డేట్‌లు రానున్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి బ్రెజా, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు, అప్‌డేటెడ్ టాటా పంచ్, నెక్ట్స్ జనరేషన్ నెక్సాన్, అలాగే కొత్త జనరేషన్ మహీంద్రా XUV 3XO, కియా సోనెట్‌లు ఉన్నాయి. ఈ రాబోయే ఎస్‌యూవీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్: అప్‌డేటెడ్ పంచ్ కారు, ఇటీవల వచ్చిన పంచ్ ఈవీ నుంచి కొన్ని డిజైన్ అంశాలను స్వీకరించే అవకాశం ఉంది. దీని ముందు భాగంలో కొత్త గ్రిల్, బంపర్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు ఉండవచ్చు. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు రానున్నాయి. ఇంజిన్ సెటప్‌లో 1.2 లీటర్ పెట్రోల్, పెట్రోల్-CNG యూనిట్లు కొనసాగుతాయి.
న్యూ జనరేషన్ టాటా నెక్సాన్: అంతర్గతంగా గరుడ ప్రాజెక్ట్‌గా పిలువబడే నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్.. ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌లో భారీ మార్పులతో, కొత్త డిజైన్ లాంగ్వేజ్ స్వీకరించనుంది. ఈ కొత్త మోడల్‌లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సూట్‌తో పాటు మరింత అడ్వాన్సుడ్ ఫీచర్లు చేరవచ్చు. అయితే, కఠినమైన BS7 ప్రమాణాల కారణంగా డీజిల్ ఇంజిన్ నిలిపివేయబడి, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చు.
మారుతి బ్రెజా ఫేస్‌లిఫ్ట్: 2026లో రాబోయే అప్‌డేటెడ్ బ్రెజాలో అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏమిటంటే.. ఇందులో కూడా అండర్‌బాడీ CNG ట్యాంక్ ఉండే అవకాశం ఉంది. దీనివల్ల కస్టమర్లు CNG వేరియంట్‌ను ఎంచుకున్నా, బూట్ స్పేస్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. కొన్ని అదనపు ఫీచర్లతో పాటు ADAS సూట్ కూడా బ్రెజాలో చేరే అవకాశం ఉంది.
మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్: 2026లో ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాసోవర్‌కు కూడా పెద్ద అప్‌డేట్ వస్తుంది. ఇందులో కూడా ADAS సూట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, 2026 మారుతి ఫ్రాంక్స్ ద్వారానే సుజుకి మోటార్ కార్పొరేషన్ కొత్తగా అభివృద్ధి చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
న్యూ జనరేషన్ మహీంద్రా XUV 3XO: తదుపరి తరం మహీంద్రా XUV 3XO డిజైన్.. విజన్ X కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ మహీంద్రా కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్పై రూపొందించారు. దీని ద్వారా దీనికి హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది.
న్యూ జనరేషన్ కియా సోనెట్: నెక్స్ట్ జనరేషన్ కియా సోనెట్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియకపోయినా, ఇందులో మెరుగైన స్టైలింగ్, మరింత అప్‌మార్కెట్ ఇంటీరియర్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

