MG Hector Hawk : ప్రముఖ వాహన తయారీ సంస్థ MG మోటార్ భారత మార్కెట్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ప్రజాదరణ పొందిన వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా రూపొందుతున్న MG Hector Hawk అనే కొత్త ఎస్‌యూవీని ఆగస్టు 2026లో లాంచ్ చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. ఇటీవల నిర్వహించిన రోడ్ టెస్టింగ్‌లో ఈ కారు ఎలక్ట్రిక్ అవతార్‌లో రహదారులపై ప్రత్యక్షమైంది. ఈ కార్ మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, మహీంద్రా XEV 9S లకు అత్యంత కఠినమైన పోటీని ఇవ్వనుంది.

కొత్త ADAPT ప్లాట్‌ఫారమ్, ఆకర్షణీయమైన లుక్

ఈ సరికొత్త ఎస్‌యూవీని MG సంస్థ ఇటీవల పరిచయం చేసిన అడ్వాన్స్‌డ్ ADAPT ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించింది. టెస్టింగ్ సమయంలో కనిపించిన కార్ వివరాల ప్రకారం.. ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార LED హెడ్‌లైట్లు, పైన, కింద భాగాల్లో అట్రాక్టివ్ DRLs అమర్చబడి ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా క్లోజ్ చేసి ఉండటంతో ఇది ఈవీ మోడల్ అని స్పష్టమవుతోంది. సైడ్ ప్రొఫైల్‌లో అలాయ్ వీల్స్, ఎడమ వైపు ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ ఉండగా, వెనుక వైపు వ్రాప్‌అరౌండ్ LED టెయిల్‌లైట్స్, రేర్ వైపర్, స్పాయిలర్ దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టాయి.

అత్యాధునిక ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు

MG Hector Hawk ఇంటీరియర్ అంతర్జాతీయ మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. కేబిన్‌లో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.8 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఇచ్చే అవకాశం ఉంది. లగ్జరీ లెథ్రెట్ అప్‌హోల్‌స్టరీతో కూడిన 7-సీటర్ లేఅవుట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 50W వైర్‌లెస్ ఛార్జర్, 6-స్పేస్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కార్ సొంతం.

పవర్‌ఫుల్ బ్యాటరీ, భారీ మైలేజ్

ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), ఆల్-ఎలక్ట్రిక్ (EV) అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది. PHEV వేరియంట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 20.5 kWh బ్యాటరీతో వచ్చి 195 HP పవర్, 125 కి.మీ కేవలం ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్ అందిస్తుంది. ఇక EV వేరియంట్ 69.2 kWh బ్యాటరీ ప్యాక్, 201 HP ఎలక్ట్రిక్ మోటార్‌తో ఏకంగా 530 కి.మీ క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ (TPMS), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-హోల్డ్ అసిస్ట్, సెన్సార్లతో కూడిన కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story