మసాజ్ కూడా చేస్తుంది.. ఈ మెజెస్టర్ మామూలు ముదురు కాదు

MG Majestor : భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న టయోటా ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు సరికొత్త మృగరాజు వస్తున్నాడు. ఎంజీ మోటార్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎంజీ మెజెస్టర్‎ను ఏప్రిల్ 20న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ.41,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ లగ్జరీ బీస్ట్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇంజిన్ పవర్

ఎంజీ మెజెస్టర్‌లో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 215 bhp పవర్, 478 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తోడవ్వడంతో డ్రైవింగ్ అనుభూతి చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్ (ఫ్రంట్, సెంటర్, రియర్) సిస్టమ్ ఉంది. ఈ విభాగంలో ఈ ఫీచర్ ఉన్న మొట్టమొదటి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.

ఆఫ్-రోడింగ్ సామర్థ్యం

మెజెస్టర్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇది ఏకంగా 810 మిమీ లోతు ఉన్న నీటిలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణించగలదు. ఇందులో మడ్, శాండ్, రాక్, స్నో వంటి 10 రకాల టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా ఎం-కాల్ ఫంక్షన్ ద్వారా అత్యంత కఠినమైన దారుల్లో కూడా బండిని సులభంగా నియంత్రించవచ్చు.

ఇంటీరియర్

మెజెస్టర్ లోపల అడుగుపెడితే ఒక విలాసవంతమైన ప్రపంచం కనిపిస్తుంది. 6, 7 సీటర్ ఆప్షన్లలో లభించే ఈ కారులో స్మోక్డ్ ఎబోనీ థీమ్ ఇంటీరియర్ ఉంది. 8 రకాల మసాజ్ ఫీచర్లు ఉన్న సీట్లు, 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్, 12 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ దీనికి రాజసం తెచ్చిపెడతాయి. మొదటి రెండు వరుసల్లో వెర్టిలేటెడ్ సీట్లు ఉండటం వల్ల ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది.

అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్

డిజైన్ పరంగా మెజెస్టర్, ఎంజీ గ్లోస్టర్ కంటే పెద్దదిగా, గంభీరంగా కనిపిస్తుంది. దీని పొడవు 5 మీటర్ల కంటే ఎక్కువ (5,046 mm), ఇది ఫార్చ్యూనర్ కంటే చాలా పెద్దది. డ్రాగన్ ఐ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, మ్యాట్రిక్స్ గ్రిల్, 19 అంగుళాల భారీ అలాయ్ వీల్స్ దీనికి అదిరిపోయే లుక్ ఇస్తున్నాయి. వెనుక వైపు మొరిస్ గ్యారేజ్ బ్రాండింగ్‌తో వచ్చే కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ కారుకు కొత్త మెరుపును ఇస్తాయి.

సేఫ్టీ

సేఫ్టీ విషయంలో ఎంజీ ఏమాత్రం రాజీ పడలేదు. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) ఫీచర్లు ఉన్నాయి. అంటే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి. ఇవే కాకుండా 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా మరియు హై-టెన్సైల్ లాడర్-ఫ్రేమ్ ఛాసిస్ ఈ కారుకు రక్షణ కవచంలా నిలుస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story