MG Motor: ప్రముఖ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ తన సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లైన ఎంజీ సైబర్‌స్టర్, ఎంజీ ఎం9 ఈవీ మోడళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాటరీ-ఎజ్-సర్వీస్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ అద్భుతమైన స్కీమ్ ద్వారా లగ్జరీ కార్ల ప్రియులు తక్కువ ప్రారంభ ధరకే ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్లాన్ కింద కారు ధర, బ్యాటరీ ధరను వేరు చేసి, బ్యాటరీకి మాత్రం కిరాయి విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఎంజీ బాస్ ప్లాన్ వివరాలు

ఈ సరికొత్త బాస్ విధానం ప్రకారం.. ఎంజీ సైబర్‌స్టర్ ప్రారంభ ధర రూ.72.49 లక్షలుగా ఉండగా, ఎంజీ ఎం9 ఈవీ ధర రూ.69.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ రెండు కార్లకు సంబంధించిన బ్యాటరీని వినియోగించినందుకు గానూ ప్రతి కిలోమీటర్‌కు రూ.8 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కారును కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లపై పడే ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. ఎంజీ సెలెక్ట్ అనే ప్రత్యేక ప్రీమియం రిటైల్ ఛైన్ ద్వారా ఈ కార్లను విక్రయిస్తున్నారు.

ఎంజీ సైబర్‌స్టర్

ఎంజీ సైబర్‌స్టర్ అనేది ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్. ఇది కేవలం 3.2 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 77 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని డ్యూయల్ మోటార్ సెటప్ 503.02 bhp పవర్, 725 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది దాదాపు 580 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ కత్తెరలా తెరుచుకునే తలుపులు, క్లాసిక్ లుక్ దీని ప్రత్యేకత.

ఎంజీ ఎం9 ఈవీ

ఇక ఎంజీ ఎం9 ఈవీ విషయానికి వస్తే, ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఇందులో 90 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది 548 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే దీని బ్యాటరీ 30 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో ప్రెసిడెన్షియల్ సీట్లు, 16-వే అడ్జస్ట్మెంట్, 8 రకాల మసాజ్ మోడ్స్, 13-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ వంటి ఎన్నో అత్యున్నత లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

Next Story