MG Windsor EV : 450 కి.మీ. రేంజ్‌తో రికార్డులు బ్రేక్ చేసిన ఎంజీ కారు.. దేశంలోనే నెంబర్ 1
దేశంలోనే నెంబర్ 1

MG Windsor EV : భారత మార్కెట్‌లో ఎంజీ మోటార్ ఇండియా ఆగస్టు 2025లో 6,578 కార్లను అమ్మింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఇది 52% ఎక్కువ. గత సంవత్సరం ఆగస్టులో కంపెనీ 4,323 కార్లను మాత్రమే విక్రయించింది. ఈసారి మళ్లీ ఎంజీ మోటార్ ఇండియా విండ్సర్ ఈవీ తన సత్తా చాటుకొని దేశంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో కంపెనీ అమ్మకాలు 5% పెరిగాయి. అలాగే, చిన్న కారు ఎంజీ కామెట్ ఈవీ కూడా ఆగస్టులో 21% పైగా అమ్మకాల పెరుగుదలతో కొత్త రికార్డును నెలకొల్పింది.
ఎంజీ మోటార్ ఇండియా తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తోంది. ఆగస్టులో మూడు కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించి దేశంలో 90% పైగా ప్రాంతాలకు తన సేవలను విస్తరించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 నగరాల్లో 543కు పైగా విక్రయ, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీస్ అందించడానికి, కంపెనీ 15 కిలోమీటర్ల పరిధిలో సర్వీస్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కస్టమర్లకు కేవలం 30 నిమిషాల్లో సాయం అందుతుందని కంపెనీ చెబుతోంది
మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఎంజీ విండ్సర్ ఈవీ భారతదేశంలో 40,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత 11 నెలల నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది. ఈ కారు బ్యాటరీ-యాస్-అ-సర్వీస్ ప్లాన్‌తో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద ప్రతి కిలోమీటర్‌కు రూ.3.9 చార్జ్ చేస్తారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, ఎంజీ మోటార్ ఇండియా విండ్సర్ EV ప్రో ఎడిషన్ను తీసుకొచ్చింది. ఇది ఎసెన్స్ ప్రో, ఎక్స్‌క్లూజివ్ ప్రో అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లలోనూ 52.9 kWh బ్యాటరీ ఉంది, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఎసెన్స్ ప్రో ట్రిమ్‌లో లెవెల్ 2 ADAS, వెహికిల్-టు-వెహికిల్ (V2V), వెహికిల్-టు-లోడ్ (V2L) ఫంక్షనాలిటీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ-యాస్-అ-సర్వీస్ ప్లాన్ కింద, విండ్సర్ ప్రో ధర రూ.13.09 లక్షలు, ఇందులో బ్యాటరీ రన్నింగ్ కాస్ట్ కిలోమీటర్‌కు రూ.4.5 అవుతుంది. కారును నేరుగా కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఐదు-సీటర్ క్రాసోవర్ ప్రారంభ ధర రూ.18.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎంజీ విండ్సర్ ఈవీలోని ఎలక్ట్రిక్ మోటార్ 136 పీఎస్ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. క్యాబిన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 135 డిగ్రీల వరకు వెనక్కి వంచగల లాంజ్ లాంటి సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, 15.6 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
