మార్కెట్‌లో పెను సంచలనం

Mid Size SUV : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే మూడు నెలల్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో నాలుగు కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్ వంటి దిగ్గజ బ్రాండ్‌ల నుంచి రానున్న ఈ కార్లు.. ఐసీఈ, ఈవీ విభాగాల్లో పోటీని పెంచుతున్నాయి. 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, ఐకానిక్ మోడళ్ల రీ-ఎంట్రీ ఉండబోతోంది.

మహీంద్రా XEV 9S

మహీంద్రా నుండి రాబోతున్న మొదటి గ్రౌండ్-అప్ ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎస్‌యూవీ XEV 9S, 'స్క్రీమ్ ఎలక్ట్రిక్' ఈవెంట్‌లో లాంచ్ కానుంది. నవంబర్ 27న బెంగళూరులో లాంచ్ కాబోతుంది. ఇది పూర్తిగా INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. 500 కిలోమీటర్లకు పైగా రేంజ్, ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్, ట్రిపుల్ స్క్రీన్ కలిగిన ప్రీమియం కేబిన్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ADAS వంటి అడ్వాన్సడ్ ఫీచర్లు ఇందులో ఉంటాయని అంచనా. ఈ మోడల్ XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది.

మారుతి సుజుకి ఇ-విటారా

మారుతి సుజుకి నుండి రాబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా, కంపెనీ గ్లోబల్ ఈవీ వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది. డిసెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టయోటాతో కలిసి సుజుకి ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై ఈ కారు అభివృద్ధి చేయబడింది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఈ ఐదు సీటర్ కారు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు ఉద్దేశించినది.

న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్

ఐకానిక్ నేమ్ రెనాల్ట్ డస్టర్ పూర్తిగా కొత్త డిజైన్, ప్లాట్‌ఫామ్‌తో భారత మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది కొత్త CMF-B ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి, మెరుగైన రేషియో, విశాలమైన కేబిన్, కొత్త పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఇందులో మొదట్లో టర్బో పెట్రోల్ ఆప్షన్, ఆ తర్వాత హైబ్రిడ్ సిస్టమ్ కూడా లభిస్తాయి. కారులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, కనెక్టెడ్ ఫీచర్లు, అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీలతో కూడిన ఇంటీరియర్ ఉంటుంది.

కొత్త టాటా సియెరా

భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్‌యూవీ పేర్లలో ఒకటి అయిన టాటా సియెరా తిరిగి రాబోతోంది. ఇది కర్వ్, హారియర్ మధ్య స్థానంలో ఉంటుంది. నవంబర్ 25న లాంచ్. మొదటగా ఐసీ-ఇంజిన్ వెర్షన్ వస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ 2026 ప్రారంభంలో వస్తుంది. ఐసీఈ వెర్షన్‌లో టాటా 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది దాదాపు 168 PS, 280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సియెరా ఈవీ కూడా 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వగలదని అంచనా.

PolitEnt Media

PolitEnt Media

Next Story