EV Cars 2026 : ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ భయంతో ఎలక్ట్రిక్ కార్ల వైపు జనాల క్యూ
పెట్రోల్ భయంతో ఎలక్ట్రిక్ కార్ల వైపు జనాల క్యూ

Royal Enfield : కస్టమ్ బైకుల ప్రపంచంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బైక్ సరికొత్త మోడిఫైడ్ అవతారంలో ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ కస్టమ్ బైక్ డిజైనర్, మాజీ రేసర్ రోలాండ్ సాండ్స్ ఈ బైక్‌ను అద్భుతంగా రీ-డిజైన్ చేశారు. దీనికి ఆర్‌ఎస్‌డీ రీలోడ్ 650 అని పేరు పెట్టారు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వన్ మోటార్‌సైకిల్ షో 2026లో ఈ బైక్‌ను మొదటిసారి ప్రదర్శించగా, బైక్ లవర్స్ దీని లుక్‌కు ఫిదా అయిపోతున్నారు.
ఈ కస్టమ్ బైక్‌ను పాత కాలపు వింటేజ్ లుక్, మోడ్రన్ టెక్నాలజీల కలయికగా రూపొందించారు. ఇందులో వాడిన బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూస్తుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ పాత కాలపు ఐకానిక్ బుల్లెట్ కారును గుర్తుకు తెస్తుంది. 1980ల కాలంలో అమెరికాలో రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే ఏఎమ్‌ఏ రేసింగ్ బైక్‌ల డిజైన్ ఆధారంగా దీనిని తయారు చేశారు. దీనివల్ల ఈ బైక్‌కు ప్యూర్ రేసింగ్, స్పోర్టీ లుక్ వచ్చింది. కారు వెనుక వైపు ఎంగ్లర్ బాడీవర్క్, సింగిల్ గన్‌ఫైటర్ స్టైల్ సీటు ఇవ్వడం వల్ల బైక్ చాలా షార్ప్‌గా, బరువు తక్కువగా కనిపిస్తుంది.
ఈ బైక్‌లో కేవలం రంగులు మార్చడమే కాకుండా పర్ఫార్మెన్స్ పెంచేలా ఎన్నో మెకానికల్ మార్పులు చేశారు. బైక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, 5-స్పోక్స్ గల ప్రత్యేకమైన ఆర్‌ఎస్‌డీ వీల్స్‌ను అమర్చారు. కస్టమ్ మేడ్ ఫుట్‌పెగ్స్, సరికొత్త షిఫ్ట్ లివర్, S&S కంపెనీకి చెందిన స్పెషల్ టూ-ఇన్-వన్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్) సిస్టమ్‌ను వాడారు. దీనివల్ల బైక్ నడుపుతున్నప్పుడు వచ్చే శబ్దం మరింత బేస్‌తో, పవర్‌ఫుల్‌గా వినిపిస్తుంది.
బైక్ ముందు భాగంలో స్ట్రాంగ్ లుక్ కోసం అల్యూమినియం ఫెండర్ స్ట్రట్‌ను ఉపయోగించారు. రైడర్ లాంగ్ జర్నీ చేసినా అస్సలు అలసిపోకుండా ఉండేందుకు వీలుగా వెడల్పాటి హ్యాండిల్‌బార్ ఇచ్చారు. ఇది క్లాసిక్, చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఇంజన్, బాడీ పార్ట్స్‌పై ఉన్న ఫిన్ డిజైన్ బైక్‌కు మరింత ప్రీమియం ఫినిషింగ్‌ను తెచ్చిపెట్టింది. పాత బుల్లెట్ స్టైల్, ఆధునిక 650 సీసీ పవర్‌ను కోరుకునే వారికి ఈ ఆర్‌ఎస్‌డీ రీలోడ్ 650 ఒక విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

