ట్రయంఫ్ ట్రైడెంట్ 660లో అదిరిపోయే మార్పులు

Triumph : ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన 660cc ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ను సమూలంగా ప్రక్షాళన చేసింది. 2026 మోడళ్లలో పవర్ అవుట్‌పుట్ ఇప్పుడు 95 PS కి చేరుకుంది, ఇది పాత మోడల్ కంటే 14 PS ఎక్కువ. అలాగే టార్క్ కూడా 68 Nm కి పెరిగింది. ఈ అదనపు పవర్ కోసం కంపెనీ కొత్త సిలిండర్ హెడ్, పెద్ద ఎగ్జాస్ట్ వాల్వ్‌లు, హైయర్-లిఫ్ట్ క్యామ్ ప్రొఫైల్‌ను ఉపయోగించింది. దీనివల్ల బైక్ తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద కూడా చాలా స్మూత్‌గా, అదే సమయంలో వేగంగా ప్రయాణిస్తుంది.

ట్రైడెంట్ 660 విషయానికి వస్తే.. దీని ఫ్యూయల్ ట్యాంక్‌ను వెడల్పుగా రీడిజైన్ చేశారు. రైడర్లు తమ మోకాళ్లను ఆనించుకోవడానికి వీలుగా లోతైన కటౌట్స్ ఇచ్చారు. దీనివల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్తగా కాస్మిక్ ఎల్లో, స్టోన్ గ్రే, స్నోడోనియా వైట్ వంటి ఆకర్షణీయమైన రంగులను ప్రవేశపెట్టారు. వీటికి తోడు షోవా సస్పెన్షన్, మిచెలిన్ రోడ్ 5 టైర్లు బైక్ హ్యాండ్లింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయి.

ఇక టూరింగ్ ప్రియుల ఇష్టదైవం టైగర్ స్పోర్ట్ 660లో అతిపెద్ద మార్పు దాని ఫ్యూయల్ ట్యాంక్. ఇప్పుడు ఇది 18.6 లీటర్ల సామర్థ్యంతో వస్తోంది. అంటే మీరు ఒక్కసారి పెట్రోల్ కొట్టిస్తే సుమారు 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. గాలి, చలి నుంచి రక్షణ కోసం అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్‌ను మెరుగుపరిచారు. ఇందులో హ్యాండ్‌గార్డ్స్ మరియు హీటెడ్ గ్రిప్స్ వంటి యాక్సెసరీలను కూడా అమర్చుకునే వెసులుబాటు ఉంది.

సాంకేతికత పరంగా కూడా ఇవి చాలా ముందంజలో ఉన్నాయి. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు ట్రయంఫ్ షిఫ్ట్ అసిస్ట్ జోడించారు, దీనివల్ల క్లచ్ వాడకుండానే గేర్లు మార్చుకోవచ్చు. మూడు రైడింగ్ మోడ్లు, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు రైడర్ భద్రతను నిర్ధారిస్తాయి. ధర పరంగా చూస్తే, యూకేలో వీటి ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.11.5 లక్షల మధ్య ఉంది. భారత్‌లో కూడా దాదాపు ఇదే ధరకు లేదా స్వల్ప మార్పులతో ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story