బజాజ్ నుండి 2 కొత్త బైకులు

Bajaj Auto : బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో కొత్త డోమినార్ 400, డోమినార్ 250 మోడళ్లను విడుదల చేసింది. ఈ బైకులలో చాలా కొత్త ఫీచర్లు జోడించారు. డోమినార్ 250 ధర రూ.1.92 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, 2025 డోమినార్ 400 ధర రూ.2.39 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ రెండు బైకులలో ఇప్పుడు కొత్త రైడింగ్ మోడ్స్ , కొత్త డిజిటల్ మీటర్, ఫ్యాక్టరీ నుండి అమర్చిన కొన్ని యాక్సెసరీస్ లభిస్తాయి.

డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు, కానీ ఇప్పుడు డోమినార్ 400లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ ద్వారా రైడ్-బై-వైర్ టెక్నాలజీని అందించారు. ఇది రోడ్ , రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే 4 రైడ్ మోడ్స్‌ను అందిస్తుంది. డోమినార్ 250లో కూడా ఇప్పుడు 4 ఏబీఎస్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి మెకానికల్ థ్రాటిల్ బాడీ పై ఆధారపడి పనిచేస్తాయి. ఇటీవల బజాజ్ పల్సర్ 250లో కూడా ఇదే టెక్నాలజీని వాడారు.

ఇప్పుడు రెండు బైకులలో బాండెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది. దీనిలో స్పీడో ఫ్లాప్ కూడా ఉంది. దీనివల్ల స్క్రీన్‌పై సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. వర్షం, ఎండ ప్రభావం పడదు. హ్యాండిల్‌బార్ డిజైన్‌ను కూడా మార్చారు. తద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు చేతులకు మరింత విశ్రాంతి లభిస్తుంది. కొత్త స్విచ్‌గేర్ అమర్చారు, దీనివల్ల కొత్త టెక్నాలజీని సులభంగా నియంత్రించవచ్చు. దీంతో పాటు కంపెనీ ఫ్యాక్టరీ నుండి కొన్ని యాక్సెసరీలను కూడా చేర్చింది.

బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే మాట్లాడుతూ.. "డోమినార్ కేవలం ఒక బైక్ కాదు, అది ఒక అనుభవం. ట్రావెల్ గైడ్స్ ఇవ్వలేని అనుభవాన్ని ఇస్తుంది. 2025 డోమినార్ రేంజ్ ద్వారా భారతదేశంలో స్పోర్ట్స్ టూరింగ్ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాము" అని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story