ఎల్ఈడీ లైట్లతో ఇక దీని రేంజ్ మామూలుగా ఉండదు

New Bajaj Pulsar 150 : భారతీయ యువత మనసు దోచుకున్న లెజెండరీ బైక్ బజాజ్ పల్సర్ 150 ఇప్పుడు సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. దశాబ్ద కాలంగా మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న పల్సర్, కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంది. 2010 తర్వాత ఈ బైక్‌కు జరిగిన అతిపెద్ద విజువల్ అప్‌డేట్ ఇదేనని చెప్పాలి. పాత పల్సర్ డీఎన్ఏను ఏమాత్రం మార్చకుండానే, మోడ్రన్ టెక్నాలజీని జోడించి కంపెనీ దీనిని రీ-లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎల్ఈడీ లైట్ల రాకతో ఈ బైక్ లుక్ ఇప్పుడు మరింత షార్ప్‌గా, అగ్రెసివ్‌గా మారిపోయింది.

కొత్తదనంతో మెరిసిపోతున్న లుక్

కొత్త పల్సర్ 150లో ప్రధాన మార్పు దాని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్. ఇప్పటివరకు హాలోజన్ బల్బులతో వచ్చిన పల్సర్, ఇప్పుడు స్టైలిష్ ఎల్ఈడీ సెటప్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీనివల్ల రాత్రి పూట ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. పల్సర్ క్లాసిక్ గుర్తింపు అయిన మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, స్ప్లిట్ సీట్లను అలాగే ఉంచారు. కానీ, కొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్లు ఈ బైక్‌కు ఒక ప్రీమియం ఫినిషింగ్‌ను ఇచ్చాయి.

నమ్మకమైన ఇంజిన్ పనితీరు

డిజైన్ పరంగా మార్పులు చేసినా, ఇంజిన్ విషయంలో బజాజ్ తన పాత నమ్మకాన్ని అలాగే కొనసాగించింది. ఇందులో 149.5cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను వాడారు. ఇది 13.8 bhp పవర్, 13.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, సిటీ రోడ్లపై, హైవేలపై కూడా స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. పల్సర్ 150 అంటేనే పవర్, మైలేజీల పర్ఫెక్ట్ కాంబినేషన్, ఆ విషయంలో ఈ బైక్ తన సత్తాను మరోసారి చాటుతోంది.

ధర, పోటీ

కొత్త అప్‌డేట్స్ తో వచ్చిన బజాజ్ పల్సర్ 150 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.08 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్లను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మార్కెట్లో దీనికి టీవీఎస్ అపాచీ RTR 160, హోండా యూనికార్న్, యమహా FZ-S V3 వంటి బైక్స్ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే, పల్సర్ బ్రాండ్ వాల్యూ,తది ఇప్పుడు తోడైన మోడ్రన్ ఫీచర్లతో ఇది మళ్ళీ సెగ్మెంట్ టాపర్‌గా నిలవడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story