Hyundai: అంతర్జాతీయ మార్కెట్లో ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తూ హ్యుందాయ్ సంస్థ తన సరికొత్త ఐదవ తరం టక్సన్ ఎస్‌యూవీని అధికారికంగా రివీల్ చేసింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అత్యాధునిక వాహనానికి సంబంధించిన అప్‌డేట్లను కంపెనీ వెల్లడించింది. సౌత్ కొరియా మార్కెట్‌లో ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి రానుండగా, 2027 నాటికి ఇతర గ్లోబల్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

మునుపటికంటే మరింత పెద్దదిగా

కొత్త టక్సన్ డిజైన్‌లో హ్యుందాయ్ సంస్థ విప్లవాత్మక మార్పులు చేసింది. ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఈ ఎస్‌యూవీని మరింత బాక్సీగా, పవర్‌ఫుల్ రోడ్ ప్రెజెన్స్ ఉండేలా తీర్చిదిద్దారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 60 మి.మీ పొడవు, 40 మి.మీ వెడల్పు, 20 మి.మీ ఎత్తులో పెరిగింది. అలాగే వీల్‌బేస్ కూడా 30 మి.మీ మేర విస్తరించడంతో క్యాబిన్ లోపల మరింత ఎక్కువ స్థలంతో పాటు లగ్జరీ అనుభూతి లభిస్తుంది.

ప్రత్యేక లైటింగ్ అలాగే ఎక్స్‌ఆర్టీ ప్రో వెర్షన్

ఈ కొత్త ఎస్‌యూవీలో సరికొత్త హెచ్-ఎడ్జ్ లైటింగ్ డిజైన్‌ను అమర్చారు. వెనుకవైపు 3డీ డిజైన్ ప్రిజమ్ ల్యాంప్స్‌తో పాటు ప్రత్యేక మైక్రో పిక్సెల్ లైటింగ్ టెక్నాలజీని అందించారు. ముఖ్యంగా ఆఫ్‌రోడింగ్ లవరలను ఆకట్టుకునేందుకు ఎక్స్‌ఆర్టీ ప్రో అనే రగడ్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్, ఆల్-టెయిర్ టయర్లు, రికవరీ హుక్స్, 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అధునాతన ఆఫ్‌రోడ్ ఫీచర్లు ఉన్నాయి.

అత్యాధునిక డిజిటల్ క్యాబిన్

క్యాబిన్ లోపలి భాగం పూర్తిగా సరికొత్త డిజైన్‌తో రూపొందించారు. టూ-లేయర్ డాష్‌బోర్డ్, డి-కట్ స్టెయిరింగ్ వీల్‌‌తో పాటు మోడ్రన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు. వేరియంట్లను బట్టి టచ్‌స్క్రీన్ పరిమాణం 12.9 అంగుళాల నుంచి 17 అంగుళాల వరకు ఉంటుంది. భద్రత, సౌకర్యం కోసం డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, త్రీ-జోన్ క్లైమెట్ కంట్రోల్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన రిలాక్సేషన్ సీట్లు ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారిత ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్ ద్వారా ఓవర్-ది-ఎయిర్ అప్‌‌డేట్లు లభిస్తాయి.

పవర్‌ఫ్రంట్ అలాగే హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు

మార్కెట్ల అవసరాలకు తగినట్లుగా టక్సన్ వివిధ రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 193హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. దీనికి తోడు నెక్స్ట్-జెన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన వేరియంట్ దాదాపు 242హెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన సేఫ్టీ కోసం 9 ఎయిర్‌బ్యాగ్స్, నేవిగేషన్-బేస్డ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, స్మార్ట్ టెర్రైన్ అసిస్ట్ వంటి అనేక ఆధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Next Story