Honda City : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ సెడాన్ కార్లకు రారాజుగా వెలుగొందుతున్న ఐకానిక్ కారు హోండా సిటీ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. హోండా కార్స్ ఇండియా సంస్థ ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను రేపే (మే 22, 2026) అధికారికంగా లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకున్న ఈ సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ టీజర్లు చూస్తుంటే.. ఈసారి కారు డిజైన్, ఇంటీరియర్ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. క్రెటా, సెల్టోస్ వంటి ఎస్‌యూవీల హవా నడుస్తున్నా.. సెడాన్ క్లాస్ లుక్ ఇష్టపడే కస్టమర్ల కోసం హోండా ఈ అద్భుతమైన అప్‌డేట్లను మోసుకొచ్చింది.

కనెక్టెడ్ లైటింగ్‌తో కిల్లింగ్ ఫ్రంట్ లుక్

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో అందరినీ ఆకట్టుకునేలా ముఖభాగాన్ని పూర్తిగా మార్చేశారు. ఇందులో సరికొత్త డిజైన్ గల ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌తో పాటు పైభాగంలో స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ల జతచేశారు. గ్రిల్ పైభాగంలో ఒక కనెక్టెడ్ లైటింగ్ ఎలిమెంట్‌ను ఇవ్వడం వల్ల రాత్రి పూట ఈ కారు రోడ్డుపై చాలా ప్రీమియం వైబ్‌ను ఇస్తుంది. పాత మెష్ ప్యాటర్న్ గ్రిల్ స్థానంలో ఇప్పుడు హారిజాంటల్ ఎలిమెంట్స్ ఇచ్చారు. కారుకు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి ఫ్రంట్ బంపర్‌ను కూడా రీ-డిజైన్ చేశారు.

స్పోర్టీ అల్లాయ్ వీల్స్..

సైడ్ ప్రొఫైల్ చూస్తే పాత మోడల్ రాజసం అలాగే కనిపిస్తున్నప్పటికీ.. సరికొత్తగా డిజైన్ చేసిన 16-ఇంచుల డైమండ్-కట్ బ్లాక్ ఫినిష్ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి స్పోర్టీ టచ్ ఇచ్చాయి. ఇక వెనుక భాగంలో అప్‌డేటెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు బూట్ లిడ్‌పై మరింత స్టైలిష్‌గా ఉండే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌ను అమర్చారు. దీనివల్ల కారు హైస్పీడ్‌లో వెళ్లేటప్పుడు మంచి స్టెబిలిటీ లభిస్తుంది.

పెద్ద స్క్రీన్, వెంట్లేటెడ్ సీట్లు..

ఇంటీరియర్ పరంగా కస్టమర్ల కోరికలను హోండా పూర్తిగా నెరవేర్చింది. పాత 8-ఇంచుల స్క్రీన్ స్థానంలో ఇప్పుడు మరింత పెద్దదైన బిగ్ సైజ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను నిలువుగా అమర్చారు. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సదుపాయం ఉంది. దీనితో పాటు ఎండకాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంట్లేటెడ్ ఫ్రంట్ సీట్లు, సులభంగా పార్కింగ్ చేసుకోవడానికి 360-డిగ్రీ కెమెరా, రాత్రి వేళ మూడ్‌ను మార్చేసే అంబియంట్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లను జోడించారు. పాత క్లాసిక్ బ్లాక్ అండ్ బేజ్ కలర్ థీమ్‌ను అలాగే ఉంచారు.

పాత నమ్మకమైన ఇంజన్..

మెకానికల్ పరంగా చూస్తే కారు ఇంజన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత నమ్మకమైన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో కొనసాగించారు. ఇది 121 bhp పవర్, 145 Nm టార్క్ జనरेट చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారి కోసం 1.5 లీటర్ అట్కిన్సన్-సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్ కూడా లభిస్తుంది. ఇది 124 hp పవర్‌తో పాటు లీటరుకు దాదాపు 25 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story