పాత దానికంటే మరింత పవర్‌ఫుల్

Mahindra Thar : భారత మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు వాహన తయారీ సంస్థ మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని కొత్త డిజైన్, ఫీచర్లతో విడుదల చేయనుంది. కంపెనీ ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించనప్పటికీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ సెప్టెంబర్ 2025 చివరిలో రావచ్చని అంచనా. కొత్త 2025 మహీంద్రా థార్ టెస్ట్ రన్ సమయంలో చాలాసార్లు కనిపించింది. కొత్త 2025 మహీంద్రా థార్‌ ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. ఈ ఎస్‌యూవీలో కొత్త యూఐలో పనిచేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ డ్రైవర్ డిస్‌ప్లే, కొత్త ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.

కొత్త థార్ 3-డోర్ మోడల్‌కు థార్ రాక్స్ నుంచి చాలా ఫీచర్లను తీసుకుంటారు. వాటిలో 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, లెవెల్-2 ADAS వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లు కారు లోపల మరింత సౌకర్యాన్ని, సేఫ్టీని పెంచుతాయి.

కొత్త 2025 మహీంద్రా థార్ డిజైన్, స్టైలింగ్ థార్ రాక్స్ నుంచి స్ఫూర్తి పొందుతుంది. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన డబుల్-స్టాక్డ్ స్లాట్స్ ఉన్న గ్రిల్, కొద్దిగా మార్చబడిన బంపర్, కొత్త హెడ్‌ల్యాంప్స్‌తో చాలా మార్పులు చేశారు. ఇతర డిజైన్ హైలైట్స్‌లో కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్, కొత్త రియర్ బంపర్ ఉన్నాయి.

మహీంద్రా ఈ అప్‌డేటెడ్ థార్ మోడల్ లైన్‌అప్‌లో కొత్త ఎక్స్టీరియర్ కలర్ స్కీమ్‌లను కూడా ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుతం థార్ 5 రంగులలో లభిస్తుంది. డీప్ గ్రే, రెడ్ రేజ్, ఎవరెస్ట్ వైట్, డెజర్ట్ ఫ్యూరీ, డీప్ ఫారెస్ట్, స్టీల్త్ బ్లాక్.

ఇంజిన్ విషయంలో కొత్త 2025 మహీంద్రా థార్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అంటే కస్టమర్లకు మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. అవి 152 బీహెచ్‌పీ ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 119 బీహెచ్‌పీ ఉన్న 1.5 లీటర్ టర్బో డీజిల్, 130 బీహెచ్‌పీ ఉన్న 2.2 లీటర్ టర్బో డీజిల్.

ట్రాన్స్‌మిషన్ కూడా ప్రస్తుత మోడల్‌లో ఉన్నవే కొనసాగుతాయి. అప్‌డేటెడ్ థార్ 3-డోర్ ఆర్డబ్ల్యూడీ (రియర్-వీల్ డ్రైవ్), 4డబ్ల్యూడీ (ఫోర్-వీల్ డ్రైవ్) రెండు ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story