Maruti Brezza : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ పాపులర్ ఎస్‌యూవీ బ్రెజా ఫేస్‌లిఫ్ట్ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌ను LXI, VXI, ZXI, ZXI+ అనే నాలుగు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 7.40 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్‌లో పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించారు. బ్రెజా కొనుగోలు చేయాలనుకునే వారికి ఏ వేరియంట్ సరిగ్గా సరిపోతుందో తెలుసుకోవడానికి ప్రతి వేరియంట్ ఫీచర్లు, ఇంజిన్, మైలేజ్ వివరాలు తెలుసుకుందాం.

మూడు ఇంజిన్ ఆప్షన్లు.. 5 స్టార్ సేఫ్టీ ప్రామాణికం

కొత్త మారుతి బ్రెజా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. మొదటిది 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ కాగా.. ఇది 109 BHP పవర్, 170 Nm టార్క్‌ను ఇస్తుంది. రెండోది 1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 102 BHP పవర్, 139 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడోది 1.5 లీటర్ S-CNG వెర్షన్, ఇది సిఎన్‌జీ మోడ్‌లో 85 BHP పవర్ ఇస్తుంది. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే.. కొత్త బ్రెజాలోని అన్ని వేరియంట్లు BNCAP సేఫ్టీ టెస్టింగ్‌లో ప్రతిష్టాత్మక 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి.

LXI మరియు VXI వేరియంట్ల ఫీచర్లు

LXI (బేస్ వేరియంట్): తక్కువ బడ్జెట్‌లో సురక్షితమైన ఎస్‌యూవీ కోరుకునే వారి కోసం ఇది రూపొందించబడింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్టులు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి. అయితే ఇందులో టచ్‌స్క్రీన్ ఫీచర్ ఉండదు.

VXI వేరియంట్: ఇది ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఇందులో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, అర్కామిస్ ఆడియో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్లు, వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి. టర్బో మోడల్‌లో ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ డిఫాగర్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్లు కూడా లభిస్తాయి.

ZXI, ZXI+ (టాప్ వేరియంట్) ప్రత్యేకతలు

ZXI వేరియంట్: ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్‌లు, ఎల్ఈడీ DRLలు, టీఎఫ్‌టీ కలర్ MID, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్, రూఫ్ రైల్స్, స్మోక్ క్రోమ్ గ్రిల్, PM 2.5 కేబిన్ ఎయిర్ ఫిల్టర్ ఉన్నాయి.

ZXI+ (టాప్ ఎండ్): ఇందులో అత్యంత లగ్జరీ ఫీచర్లు అమర్చారు. 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ HD కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, నెక్స్ట్-జెన్ సుజుకి కనెక్ట్, ఇన్‌బిల్ట్ అలెక్సా లభిస్తాయి. భద్రత కోసం బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఇచ్చారు.

ఏ ఇంజిన్ ఎంత మైలేజ్ ఇస్తుంది?

టర్బో పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. LXI, VXI వేరియంట్లలో ఇది లీటరుకు 20.47 కి.మీ మైలేజ్ ఇవ్వగా.. ZXI, ZXI+ లలో 19.96 కి.మీ ఇస్తుంది. 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ మ్యాన్యువల్ వర్షన్ LXI, VXI, ZXI లలో లీటరుకు 21.09 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఆటోమేటిక్ వర్షన్ VXI, ZXI, ZXI+ లలో లభిస్తుంది, ఇది 20.17 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇక S-CNG వర్షన్ LXI, VXI, ZXI లలో లభ్యమవుతూ కేజీకి 26.90 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story