మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ టీజర్ రిలీజ్

Maruti Suzuki : భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి మరోసారి ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించబోతోంది. కంపెనీ తన రాబోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో దాని ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ కనిపిస్తోంది. ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలతో నేరుగా పోటీ పడుతుంది. హెచ్‌టీ ఆటోలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. డిజైన్ పరంగా ఈ టెయిల్ ల్యాంప్ 3డీ ఎఫెక్ట్, మోడరన్ షేప్‌తో చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ లాంచ్ తేదీని కూడా ఖరారు చేసింది.

కంపెనీ ఈ కొత్త మోడల్ సెప్టెంబర్ 3, 2025న లాంచ్ అవుతుందని కన్ఫాం చేసింది. మారుతి ఈ ఎస్‌యూవీని గ్రాండ్ విటారా, బ్రెజా మధ్య ఉంచుతుంది. అంటే, ఇప్పుడు వినియోగదారులకు ఒక కొత్త మిడ్-రేంజ్ ఆప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా, దీనిని అరీనా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. ఈ వాహనం మార్కెట్లో అమ్మకాలలో హ్యుందాయ్ క్రెటాను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డిజైన్‌తో పాటు, దీని టెక్నాలజీ, ఇంజిన్ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 101బీహెచ్‌పీ పవర్, 139ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో సీఎన్‌జీ, పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లు కూడా లభించే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల భారతదేశంలో లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిని ఈ ఎస్‌యూవీ హైబ్రిడ్ మోడల్‌లో ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ గట్టి పట్టును కలిగి ఉన్నాయి. హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ వంటి వాహనాలు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మారుతి ఈ కొత్త ఎస్‌యూవీ ఎంట్రీ ఈ సెగ్మెంట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. కంపెనీ దీనిని రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story