లుక్, ఫీచర్లలో అంతకు మించి

Volkswagen : భారతీయ మార్కెట్లో ఇప్పుడు కొత్త కార్ల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోక్స్‌వాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ అయిన టైగన్ ను కొత్త రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇటీవల ఫోక్స్‌వాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టెస్టింగ్‌లో కనిపించింది. ఇది క్రెటా మరియు కియా సెల్టోస్‌లకు గట్టి పోటీనిస్తుంది.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, కొత్త టైగన్ ఫేస్‌లిఫ్ట్ 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో కొత్త బంపర్స్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్ ఉంటాయి. దీనివల్ల కారుకు మరింత ఆకర్షణీయమైన లుక్ వస్తుంది. కారు లోపల కొత్త కలర్ ఆప్షన్స్, అప్‌హోల్‌స్ట్రీ, అప్‌డేటెడ్ ఫీచర్లు ఉండవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

కొత్త టైగన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ మాత్రం మార్పు చేయరు. ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ (115hp),1.5-లీటర్ టర్బో పెట్రోల్ (150hp) ఇంజిన్లు యథావిధిగా కొనసాగుతాయి. ఈ కొత్త టైగన్ ఎస్‌యూవీ, మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story