హ్యుందాయ్ క్రెటాకు పోటీగా 3కొత్త ఎస్యూవీలు వచ్చేస్తున్నాయ్

New SUV War: గత దశాబ్దకాలంగా భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా తిరుగులేని రాజాలా ఉంది. అయితే, 2026లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. క్రెటాకు నేరుగా పోటీ ఇచ్చేందుకు మూడు కొత్త పవర్-ప్యాక్డ్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. అవే టాటా సియెర్రా, న్యూ జెన్ కియా సెల్టోస్, న్యూ రెనో డస్టర్. ఈ కార్లు అడ్వాన్సుడ్ ఫీచర్లు, పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో క్రెటాకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

1. టాటా సియెర్రా

టాటా మోటార్స్ తమ పాత, ఐకానిక్ మోడల్ అయిన సియెర్రాను కొత్త అవతార్‌లో 2026లో విడుదల చేయనుంది. మొదట ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుంది, దీనికి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వనుంది. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ వెర్షన్లు కూడా వస్తాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (170 హార్స్‌పవర్), 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్లు (170 హార్స్‌పవర్) ఉంటాయి. డిజైన్ పాతకాలపు, కొత్త ట్రెండ్‌ల కలయికతో బాక్సీ ఆకృతిలో ఉంటుంది. దీనిలో ప్రీమియం 3-స్క్రీన్ సెటప్, ADAS లెవెల్-2, వెంట్లేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. దీని ధర రూ.20-25 లక్షల మధ్య ఉండవచ్చు.

2. న్యూ జెన్ కియా సెల్టోస్

క్రెటాకు ప్రధాన ప్రత్యర్థి అయిన కియా సెల్టోస్ కూడా 2026 ప్రారంభంలో తన నెక్స్ట్-జెనరేషన్ వెర్షన్‌ను తీసుకురానుంది. దీని గ్లోబల్ ఇన్నోవేషన్ జనవరి 2026లో జరగనుండగా, భారతదేశంలో ఫిబ్రవరి లేదా మార్చి 2026 మధ్య లాంచ్ కానుంది. కొత్త సెల్టోస్ మరింత పెద్ద ఫ్రంట్ గ్రిల్, సన్నని LED DRLలు, కనెక్టెడ్ టెయిల్‌లైట్స్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటీరియర్‌లో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంజిన్లలో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 హార్స్‌పవర్), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. 2027లో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా కియా తీసుకురానుంది. సెల్టోస్ ధర రూ.12-21 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

3. న్యూ రెనో డస్టర్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనో డస్టర్ కూడా 2026 మార్చి కల్లా కొత్త రూపంలో తిరిగి వస్తోంది. దీని ఉత్పత్తి సెప్టెంబర్ 2025 నుంచే చెన్నై ప్లాంట్‌లో మొదలవుతుంది. కొత్త డస్టర్ మరింత రగ్గడ్, పవర్ఫుల్ లుక్‌తో, బాక్సీ డిజైన్, V- ఆకారపు టెయిల్‌లైట్స్‌తో వస్తుంది. లోపల 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇవ్వనున్నారు. ఇంజిన్లలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.6 లీటర్ హైబ్రిడ్, సీఎన్‌జీ ఆప్షన్లు ఉంటాయి. కానీ డీజిల్ ఇంజిన్ ఉండదు. దీని ధర రూ.10-18 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

PolitEnt Media

PolitEnt Media

Next Story