Tata Punch Facelift : దీపావళికి కొత్త టాటా పంచ్.. ఆకట్టకునే డిజైన్, ఆల్ట్రోజ్ లాంటి ఫీచర్లు
ఆకట్టకునే డిజైన్, ఆల్ట్రోజ్ లాంటి ఫీచర్లు

Tata Punch Facelift : టాటా మోటార్స్ ఈ సంవత్సరం అక్టోబర్‌లో దీపావళి పండుగ సమయంలో కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని చాలా కాలంగా టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్టింగ్ సమయంలో దీని గురించి చాలా కొత్త వివరాలు బయటపడ్డాయి. కొన్ని స్పై చిత్రాల ప్రకారం, పంచ్ ఫేస్‌లిఫ్ట్ పంచ్ ఈవీ లాంటి డిజైన్‌ను కలిగి ఉండవచ్చు.
డిజైన్‌లో పెద్ద మార్పులు
కొత్త టాటా పంచ్ డిజైన్‌లో కొన్ని పెద్ద మార్పులు రావచ్చు. ఇందులో ఇప్పుడు కొత్త బంపర్, సన్నని హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, కొత్త డిజైన్‌తో కూడిన LED DRL కనిపించవచ్చు. దీనితో పాటు న్యూ డిజైన్ అల్లాయ్ వీల్స్, వెనుక బంపర్ కూడా కొత్త లుక్‌లో రావచ్చు.
ఇంటీరియర్‌లో ప్రీమియంఎక్స్ పీరియన్స్
కొత్త టాటా పంచ్ ఇంటీరియర్ విషయానికి వస్తే, కారు లోపల మునుపటి కంటే కొంచెం ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తుంది. పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో అల్ట్రోజ్ లాంటి 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్-బేస్డ్ AC కంట్రోల్ ప్యానెల్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మోడల్‌లో కేవలం 7.0 అంగుళాల స్క్రీన్, సెమీ-డిజిటల్ క్లస్టర్ మాత్రమే ఉన్నాయి.
ఇంజిన్, పర్ఫామెన్స్
కొత్త టాటా పంచ్ మోడల్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. పాత ఇంజిన్‌నే ఇది కూడా ఉపయోగించుకుంటుంది. ఇందులో 1.2L 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 86 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న విధంగా సీఎన్జీ ఆప్షన్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం సీఎన్జీ మోడల్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది కానీ ఫేస్‌లిఫ్ట్‌లో AMT ఆప్షన్ కూడా రావచ్చు.
ధర, వేరియంట్లు
కొత్త టాటా పంచ్ ధర ప్రస్తుత మోడల్‌కు దగ్గరగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం దీని ధరలు రూ.6.20 లక్షల నుండి రూ.10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా ప్రస్తుతం ఉన్న 5 ట్రిమ్‌లలో వస్తుంది, అవి: ప్యూర్, ప్యూర్ (O), అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్+ ఎస్, క్రియేటివ్+.
