Kia Seltos 2026 : కియా దెబ్బకు ప్రత్యర్థుల మైండ్ బ్లాక్..రోడ్డు మీద వెళ్తుంటే అందరూ చూడాల్సిందే!
రోడ్డు మీద వెళ్తుంటే అందరూ చూడాల్సిందే!

Kia Seltos 2026 : కియా మోటార్స్ ఇండియాలో తన జైత్రయాత్రను మొదలుపెట్టిన సెల్టోస్ ఇప్పుడు సరికొత్త అవతారంలోకి వచ్చేసింది. 2019లో ఫస్ట్ టైమ్ లాంచ్ అయినప్పుడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు 2026 నెక్స్ట్ జనరేషన్ మోడల్ కూడా అదే రేంజ్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. కేవలం పైపైన మెరుగులు దిద్దడమే కాకుండా, పూర్తి కొత్త ప్లాట్‌ఫారమ్‌పై మరింత స్పేస్, టెక్నాలజీతో వచ్చిన ఈ ఎస్‌యూవీ పూర్తి వివరాలు ఈ వార్తలో చూద్దాం.
కొత్త కియా సెల్టోస్‌ను మొదటిసారి చూడగానే అది మునుపటి కంటే చాలా పెద్దదిగా, గంభీరంగా కనిపిస్తుంది. దీని పొడవు 95 మిమీ, వీల్‌బేస్ 80 మిమీ పెరగడం వల్ల రోడ్డు మీద దీనికి ఒక బిగ్ ఎస్‌యూవీ లుక్ వచ్చింది. కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ఇప్పుడు మరింత వెడల్పుగా మారి, నిలువుగా ఉండే ఎల్‌ఈడీ లైట్లతో చాలా అగ్రెసివ్‌గా ఉంది. ముఖ్యంగా ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18-అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ కారుకు ప్రీమియం టచ్ ఇచ్చాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు రాత్రి వేళల్లో కారును హైలైట్‌గా చూపిస్తాయి.
కారు లోపలికి వెళ్తే అదొక విలాసవంతమైన గదిలా అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై రెండు భారీ 12.3-అంగుళాల స్క్రీన్లు ఒకే ప్యానెల్‌లో జతచేయబడ్డాయి. ఇది కారుకు ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తుంది. సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి, మునుపటి కంటే వెనుక సీట్లలో లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్ స్పష్టంగా పెరిగింది. ఫీచర్ల విషయానికి వస్తే.. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, 8-స్పీకర్ల బోస్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి హైలైట్. వీటికి తోడు 21కి పైగా ఫీచర్లు ఉన్న ADAS లెవల్-2 సేఫ్టీ సిస్టమ్ ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది.
1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 bhp పవర్‌తో దూసుకుపోతుంది. 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది, మీరు ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఏమాత్రం తడబడకుండా పవర్ అందిస్తుంది. కొత్త ప్లాట్‌ఫారమ్ వల్ల కారు కంట్రోల్ చాలా మెరుగ్గా ఉంది. గుంతలు ఉన్న రోడ్ల మీద కూడా సస్పెన్షన్ షాక్‌లను బాగా తట్టుకుంటుంది. సిటీలో తిరగడానికి స్టీరింగ్ తేలికగా ఉంటుంది, అదే హైవేపై స్పీడ్ పెరిగేకొద్దీ అది పట్టునిస్తుంది. మైలేజీ పరంగా సిటీలో లీటరుకు 10-11 కిమీ ఇస్తుండగా, హైవేపై లీటరుకు 15-16కిమీ వరకు ఆశించవచ్చు.
మీరు ఒక స్టైలిష్, టెక్నాలజీతో నిండిన, ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చుని ప్రయాణించే ఎస్‌యూవీ కావాలనుకుంటే.. 2026 కియా సెల్టోస్ ది బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ సిటీ డ్రైవింగ్‌కు, వీకెండ్ ట్రిప్పులకు పర్ఫెక్ట్. దీని పెరిగిన ధర (అంచనా రూ. 11.20 - 22 లక్షలు) కొంచెం భారంగా అనిపించినా, ఇందులో ఉండే ఫీచర్లు, కంఫర్ట్ ఆ ఖరీదుకు న్యాయం చేస్తాయి. కియా మళ్లీ తన బెస్ట్ సెల్లర్ ట్యాగ్‌ను నిలబెట్టుకునేలాగే కనిపిస్తోంది.

