Nissan : ఎంపీవీ సెగ్మెంట్లో ప్రకంపనలు ఖాయం..రెండు ఫ్యామిలీ కార్లతో నిస్సాన్ సంచలనం
రెండు ఫ్యామిలీ కార్లతో నిస్సాన్ సంచలనం

Nissan : భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిస్సాన్ ఇండియా తన మార్కెట్‌ను విస్తరించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమైంది. ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న మ్యాగ్నైట్ విజయంతో ఉత్సాహంగా ఉన్న కంపెనీ, ఇప్పుడు మరో రెండు కొత్త మోడళ్లను రంగంలోకి దించుతోంది. అవే నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ, నిస్సాన్ టెక్టాన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఈ రెండు వాహనాలతో భారత మార్కెట్లో నిస్సాన్ తన ముద్రను మరింత బలంగా వేయాలని భావిస్తోంది.
నిస్సాన్ ఇండియా తన కొత్త వ్యూహంలో భాగంగా రేపు (జనవరి 21) గ్రావైట్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేయనుంది. మార్చి 2026 నుండి ఇది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఫిబ్రవరి 4న టెక్టాన్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఈ రెండు వాహనాలు కూడా స్టైల్, స్పేస్ మరియు పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ లేకుండా రాబోతున్నాయి.
నిస్సాన్ గ్రావైట్: నిస్సాన్ గ్రావైట్ అనేది ప్రాచుర్యం పొందిన రెనాల్ట్ ట్రైబర్‌కు రీ-బ్యాజ్డ్ వెర్షన్. అయితే, నిస్సాన్ దీనిని తనదైన శైలిలో డిజైన్ చేసింది. ఇన్వర్టెడ్ ఎల్-ఆకారపు డీఆర్ఎల్స్, సిగ్నేచర్ గ్రిల్, సిల్వర్ ఇన్సర్ట్‌లతో కూడిన బంపర్, కొత్త అలాయ్ వీల్స్ దీనికి రిచ్ లుక్ ఇస్తున్నాయి. ఇందులో 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72bhp పవర్, 96Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) ఆప్షన్లతో రానుంది. తక్కువ బడ్జెట్‌లో 7 మంది కూర్చునే వెసులుబాటు ఉండటం దీని పెద్ద ప్లస్ పాయింట్.
నిస్సాన్ టెక్టాన్: రెనాల్ట్ డస్టర్ కొత్త జనరేషన్ ఆధారంగా టెక్టాన్ రూపొందుతోంది. ఇది నిస్సాన్ గ్లోబల్ మోడల్ నిస్సాన్ పెట్రోల్ నుంచి ప్రేరణ పొందింది. సి-ఆకారపు గ్రిల్, కనెక్టెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, స్పోర్టీ బంపర్ దీనికి ఒక అగ్రెసివ్ లుక్ ఇస్తాయి. సి-పిల్లర్‌పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్, సిల్వర్ ఫినిషింగ్ రూఫ్ రైల్స్, రియర్ స్పాయిలర్ దీనికి ప్రీమియం టచ్ ఇస్తున్నాయి. ఇది కేవలం టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో మాత్రమే వస్తుంది. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. జూన్ 2026 నాటికి టెక్టాన్ భారత రోడ్లపై పరుగులు తీయనుంది.

