రూపాయి కట్టకుండానే ఇంటికి కారు!

Nissan Magnite : టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్‌లకి గట్టి పోటీ ఇస్తున్న నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు కొనుగోలుదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లతో ముందుకు వచ్చింది. సొంత కారు కలని సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా తన ఫైనాన్స్ భాగస్వామి NRFSI ద్వారా అదిరిపోయే స్కీమ్‌లను ప్రకటించింది. కేవలం తక్కువ వడ్డీకే కాకుండా, జేబులో ఒక్క రూపాయి లేకపోయినా కారును ఇంటికి తీసుకెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. సాధారణంగా బ్యాంకులు కారు లోన్లపై 8% నుంచి 10% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. కానీ మంచి సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు నిస్సాన్ కేవలం 5.55% ప్రారంభ వడ్డీ రేటుతోనే లోన్ అందిస్తోంది. అంతేకాదు కారు ధరతో పాటు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులను కూడా కలిపి 100% ఆన్-రోడ్ ఫండింగ్ ఇస్తోంది. అంటే మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేకుండానే కారును సొంతం చేసుకోవచ్చు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై ఒకేసారి ఆర్థిక భారం పడదు.

ఈ లోన్ ఆఫర్‌లో మరో గొప్ప విషయం ఏమిటంటే.. లోన్ తీసుకున్న 24 నెలల తర్వాత ఎప్పుడైనా మీరు అప్పును క్లోజ్ చేయవచ్చు, దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అవసరమైతే పార్ట్ పేమెంట్ చేసే సదుపాయం కూడా ఉంది. ఈ లోన్ ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది, దీనివల్ల కేవలం 24 గంటల్లోనే లోన్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. పాత నిస్సాన్ కస్టమర్లకైతే అదనంగా రూ.22,000 వరకు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ వీసియా ధర సుమారు రూ.5.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ మోడల్ సుమారు రూ.10.96 లక్షల వరకు ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో 360 డిగ్రీల కెమెరా, 8 అంగుళాల టచ్ స్క్రీన్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లతో ఇది నేరుగా పోటీ పడుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story