Nissan : ఎర్టిగా, కారెన్స్ దిమ్మతిరిగేలా నిస్సాన్ నుంచి కొత్త 7సీటర్ కారు.. ధర ఎంతంటే ?
ధర ఎంతంటే ?

Nissan : భారత మార్కెట్లో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి కార్లు బాగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇవ్వడానికి జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఒక కొత్త 7 సీటర్ కారును తీసుకురాబోతోంది. ఇటీవల విడుదలైన ఒక టీజర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రాబోతున్న ఈ కారు వివరాలు ఇప్పుడు చూద్దాం.
నిస్సాన్ ఇండియా ఇటీవల ఒక టీజర్ వీడియోను విడుదల చేసింది. అందులో సముద్ర మట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అమావాస్య రాత్రి, గెలాక్సీలను చూసే ప్రదేశం అని చూపించారు. ఆ తర్వాత ఇంకా కొత్తగా చూడండి అని రాసి క్లోజ్ చేశారు. ఈ టీజర్‌లో కారు పేరు లేదా ఇతర వివరాలు వెల్లడించకపోయినా ఇది రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా రూపొందించిన కొత్త 7 సీటర్ కారు అని పరిశీలకులు భావిస్తున్నారు.
నిస్సాన్ ఇప్పటికే భారతదేశంలో ఒక కొత్త కాంపాక్ట్ MPVని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త కారు రెనాల్ట్ ట్రైబర్‌తో ప్లాట్‌ఫామ్, ఫీచర్లు, ఇంజిన్‌ను షేర్ చేసుకుంటుంది. రెనాల్ట్ ఇటీవల 2025 ట్రైబర్‌ను డిజైన్, ఫీచర్లలో కొన్ని మార్పులతో విడుదల చేసింది. నిస్సాన్ కూడా తన కొత్త మోడల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
కొత్త నిస్సాన్ సబ్-కాంపాక్ట్ ఎంపీవీ, నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్, స్పోర్టీ బంపర్, కొత్త LED DRLలు, ఫంక్షనల్ రూఫ్ రేల్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో వస్తుందని టీజర్‌లో చూపించారు. ఈ కారు ట్రైబర్‌తో సమానమైన సైజులో ఉంటుంది. అయితే డిజైన్‌లో మాత్రం కొంత తేడా ఉంటుందని తెలుస్తోంది. రెనాల్ట్ ట్రైబర్ పొడవు 3,990 మి.మీ., వెడల్పు 1,739 మి.మీ., ఎత్తు 1,643 మి.మీ. ఉంటుంది.
నిస్సాన్ ఈ కొత్త 7 సీటర్ కారులో రెనాల్ట్ ట్రైబర్‌లో ఉన్న ఇంజినే ఉంటుంది. ట్రైబర్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్, నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 71 బీహెచ్‌పీ శక్తిని, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
ధర విషయానికొస్తే ఈ కారు భారతదేశంలో అత్యంత సరసమైన 7 సీటర్ కార్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.6.5 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ప్రస్తుతం రెనాల్ట్ ట్రైబర్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.9.17 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్). ఈ తక్కువ ధర కారణంగా, కొత్త నిస్సాన్ 7 సీటర్ కారు, మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వగలదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
