అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎస్యూవీ టెక్టన్

Nissan : భారత మార్కెట్‌లో మళ్లీ బలంగా నిలబడేందుకు నిస్సాన్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ జపనీస్ కార్ల తయారీ సంస్థ త్వరలో ఒక సరికొత్త ఎస్యూవీని తీసుకురావడానికి రెడీ అయింది. ఆ కొత్త మోడల్ పేరు నిస్సాన్ టెక్టన్. ఈ కారు పాత టెర్రానో మోడల్‌కు కేవలం రీప్లేస్‌మెంట్ మాత్రమే కాదు.. కంపెనీ తీసుకురాబోయే కొత్త తరం ప్రీమియం ఎస్యూవీలకు ఇది ప్రారంభం కానుంది. ఈ టెక్టన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తోంది.

టెక్టన్ డిజైన్ చాలా బోల్డ్‌గా, మస్కులర్‌గా ఉంది. దీని లుక్‌ను అంతర్జాతీయ మార్కెట్లో నిస్సాన్ అమ్ముతున్న పెద్ద పాట్రోల్ ఎస్యూవీ నుండి ప్రేరణ పొందినట్లు కంపెనీ చెబుతోంది. ముందు భాగంలో కనెక్ట్ అయినట్లు ఉండే LED DRLs, పెద్ద గ్రిల్, ఇంకా స్ట్రాంగ్‎గా కనిపించే లైన్స్ ఉన్నాయి. వెనుకవైపు కూడా కనెక్ట్ అయ్యే టెయిల్ లైట్స్, కొత్త బంపర్ వివరాలు దీనికి స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. సైడ్ లుక్‌లో, ఇది బాక్సీ ఆకారంలో ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ, హిడెన్ డోర్ హ్యాండిల్స్ ఇంకా వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు దీనికి మోడరన్ టచ్‌ను ఇస్తున్నాయి.

టెక్టన్ ఇంజన్ వివరాలను నిస్సాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ ఎస్యూవీ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతోనే వచ్చే అవకాశం ఉంది. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చు. ఒకటి 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. టర్బో వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా లభించే అవకాశం ఉంది. నిస్సాన్ ఈ ఇంజన్లను ఇదివరకే వాడినప్పటికీ, ఈసారి వాటిని మరింత స్మూత్‌గా, మెరుగైన మైలేజ్, పర్ఫార్మెన్స్ అందించేలా అప్‌డేట్ చేస్తుందని సమాచారం.

కారు లోపలి భాగం చాలా సాఫ్ట్ డిజైన్‌తో పాటు టెక్నాలజీతో నింపేశారు. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కూడా నిస్సాన్ పాట్రోల్ SUVని పోలి ఉంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా, ఇందులో ADAS వంటి హై-టెక్ ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. నిస్సాన్ టెక్టన్‌ను సెమీ-ప్రీమియం SUVగా తీర్చిదిద్దుతున్నందున, దీనిలో లగ్జరీ ఎక్స్ పీరియన్స్, మెరుగైన బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

నిస్సాన్ టెక్టన్‌ను ఇండియాలో 2026లో రిలీజ్ చేయాలని చూస్తోంది. లాంచ్ అయిన తర్వాత, ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి మిడ్-సైజ్ ఎస్యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అంతేకాకుండా, త్వరలో రాబోతున్న రెనో డస్టర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ కూడా దీనికి కాంపిటేటర్ కావొచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story