రూ.60వేల లోపే అదిరిపోయే స్కూటర్

Zelio Eeva : భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జెలియో ఈ మొబిలిటీ తమ ఈవా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త, అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో స్కూటర్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగైంది. ఈ స్కూటర్‌ను మూడు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని టాప్ స్పీడ్ కేవలం గంటకు 25 కి.మీ మాత్రమే. ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సాధారణంగా గంటకు 40 కి.మీ.ల వేగం వరకు ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్‌ను నడపడానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, అలాగే ఆర్‌టీఓలో రిజిస్ట్రేషన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు. దీని ధర విషయానికొస్తే 60V/32AH వేరియంట్ ధర రూ.50,000, రేంజ్ 80 కి.మీ. 72V/42AH వేరియంట్ ధర రూ.54,000, రేంజ్ 100 కి.మీ.

లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్ల విషయానికి వస్తే.. 60V/30AH వేరియంట్ ధర రూ.64,000, రేంజ్ 90-100 కి.మీ. 74V/32AH వేరియంట్ ధర రూ.69,000, రేంజ్ 120 కి.మీ. అన్ని వేరియంట్లు కూడా గంటకు 25 కి.మీ.ల టాప్ స్పీడ్‌తో, 60/72V BLDC మోటార్‌తో వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 150 మి.మీ, బరువు 85 కిలోలు, ఇది 150 కిలోల వరకు బరువును మోయగలదు.

ఈ స్కూటర్‌లో రెండు రకాల బ్యాటరీలు లభిస్తాయి. జెల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 8 నుంచి 10 గంటలు పడుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీకి సుమారు 4 గంటలు పడుతుంది. సేఫ్టీ కోసం, రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లు, 12-అంగుళాల చక్రాలపై 90/90 టైర్లు ఇచ్చారు. ఈవా 2025లో డిజిటల్ డిస్‌ప్లే, డే-టైమ్ రన్నింగ్ లైట్స్, కీ-లెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారం, పార్కింగ్ గేర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, వెనుక కూర్చునేవారికి ఫుట్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది నీలం, బూడిద, తెలుపు, నలుపు రంగులలో లభిస్తుంది. కంపెనీ ఈ స్కూటర్‌పై రెండు సంవత్సరాల వారంటీని, అన్ని బ్యాటరీ వేరియంట్లపై ఒక ఏడాది వారంటీని అందిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story