Upcoming Off Road SUVs : ఆఫ్ రోడింగ్ ప్రియులకు పండగే.. ఈ ఏడాది రాబోతున్న టాప్ 4 మొండి ఘటాలు ఇవే
ఈ ఏడాది రాబోతున్న టాప్ 4 మొండి ఘటాలు ఇవే

Upcoming Off Road SUVs : భారతదేశంలో అడ్వెంచర్ ప్రియులకు, ఆఫ్-రోడింగ్ పిచ్చి ఉన్నవారికి ఎస్‌యూవీలంటే ఎప్పుడూ క్రేజే. ముఖ్యంగా బాడీ ఆన్ ఫ్రేమ్ లేదా లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై తయారయ్యే కార్లు కఠినమైన దారుల్లో, గుంతల రోడ్లపై చూపించే పవర్ వేరుగా ఉంటుంది. మీరు కూడా పాత దారులను వదిలి, కొత్త అడ్వెంచర్ల కోసం పవర్‌ఫుల్ ఆఫ్ రోడ్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొంచెం ఆగండి. ఈ ఏడాది భారత మార్కెట్లోకి నాలుగు అదిరిపోయే మోడళ్లు రాబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
1. ఎంజీ మెజెస్టర్
ఎంజీ మోటార్స్ నుంచి వస్తున్న సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీ మెజెస్టర్ ఇప్పటికే ఇండియాలో తన ఉనికిని చాటుకుంది. దీని ధరలను ఏప్రిల్ 2026లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలవ్వగా, మే నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 215 హార్స్‌పవర్ శక్తిని, 478 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆన్-డిమాండ్ 4WD సిస్టమ్, 10 టెర్రైన్ మోడ్స్, ఎమ్-క్రాల్ ఫంక్షన్ వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ఏకంగా 810 మిమీ లోతు ఉన్న నీటిలో కూడా అలవోకగా ప్రయాణించగలదు.
2. మహీంద్రా స్కోర్పియో ఎన్ / క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా తన పాపులర్ మోడల్స్ అయిన స్కోర్పియో ఎన్ , స్కార్పియో క్లాసిక్‌లకు మిడ్ లైఫ్ అప్‌డేట్స్ ఇవ్వబోతోంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. కొత్త స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్లతో ఇవి కస్టమర్లను పలకరించనున్నాయి. ఇంజిన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా, డీజిల్ వేరియంట్లలో మాత్రమే 4WD సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో జిప్, జాప్, జూమ్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ అడ్వెంచర్ రైడ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
3. కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్
ఎస్‌యూవీల రారాజు టయోటా ఫార్చ్యూనర్ కొత్త అవతారంలో రాబోతోంది. 2026 చివరి నాటికి దీనిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నారు. ఇండియాలో 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త హిలక్స్ నుంచి తీసుకున్న అప్‌డేటెడ్ లాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై ఇది రూపొందుతోంది. డిజైన్ పరంగా మరింత అగ్రెసివ్ లుక్‌తో పాటు, ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లనే టయోటా కొనసాగించనుంది.
4. ఫోర్స్ గూర్ఖా 5-డోర్ అప్‌డేట్స్
ఆఫ్-రోడింగ్‌లో మొండి ఘటంగా పేరున్న ఫోర్స్ గూర్ఖా కూడా కొత్త అప్‌డేట్స్‌తో రాబోతోంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి అడ్వెంచర్లు చేయాలనుకునే వారి కోసం 5-డోర్ వెర్షన్‌లో మరిన్ని ఫీచర్లను కంపెనీ జోడించనుంది. మెకానికల్ పరంగా ఇది అత్యంత పటిష్టమైన కారుగా గుర్తింపు పొందింది.

