ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల డెలివరీలు ప్రారంభం

Ola Roadster X : ఓలా ఎలక్ట్రిక్ తన రోడ్‌స్టర్ X బైక్ సిరీస్ డెలివరీలను ఢిల్లీలో ప్రారంభించింది. పూర్తిగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలను తయారుచేసే ఈ కంపెనీ, మొదటి 5,000 రోడ్‌స్టర్ X కొనుగోలుదారులకు రూ.10,000 విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో ఉచితంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ, MoveOS+, ఎసెన్షియల్ కేర్ ఉన్నాయి. ఈ ఆఫర్ ‘రైడ్ ది ఫ్యూచర్’ ప్రచారంలో భాగంగా ఇవ్వబడుతోంది.

రోడ్‌స్టర్ X సిరీస్ మంచి పర్ఫామెన్స్, సేఫ్టీ కోసం మిడ్-డ్రైవ్ మోటార్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇందులో చైన్-డ్రైవ్ పవర్‌ట్రైన్ ఉంది. ఇది టార్క్ ఎక్ఛేంజ్ సమర్థవంతంగా చేయడంలో స్పీడ్ యాక్సిలరేషన్‌ను అందించడంలో, ఎక్కువ రేంజ్‌ను సాధించడంలో సహాయపడే ఇంటిగ్రేటెడ్ MCU ని కలిగి ఉంది. ఈ బైక్‌లో ఇండస్ట్రీలో మొదటిసారిగా ఫ్లాట్ కేబుల్స్ ఉపయోగించారు. ఇవి ప్యాకేజింగ్‌ను మెరుగుపరచడం, బరువును తగ్గించడం, థర్మల్ పనితీరును పెంచుతాయి.

ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్ X+.

స్టాండర్డ్ రోడ్‌స్టర్ X: ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. 5 kWh, 3.5 kWh, 4.5 kWh అన్నింటినీ 7 kW ఎలక్ట్రిక్ మోటార్‌కు అనుసంధానించారు. ఇది 9.4 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని బట్టి దీని టాప్ స్పీడ్ గంటకు 118 కి.మీ వరకు ఉంటుంది. ఇది కేవలం 3.1 సెకన్లలో 0-40 కి.మీ/గంట వేగాన్ని అందుకుంటుంది. 4.5 kWh వేరియంట్ ఒక పూర్తి ఛార్జ్‌పై 252 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది.

రోడ్‌స్టర్ X+ వేరియంట్: ఈ వేరియంట్‌లో 4.5 kWh లేదా పెద్ద 9.1 kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. దీనికి 11 kW మోటార్ శక్తినిస్తుంది. ఇది 14.75 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ గరిష్టంగా 125 కి.మీ/గంట వేగాన్ని అందుకోగలదు. 2.7 సెకన్లలో 0 నుండి 40 కి.మీ/గంట వేగాన్ని అందుకుంటుంది. 4.5 kWh X+ వేరియంట్ కూడా 252 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే టాప్-ఎండ్ 9.1 kWh వేరియంట్. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్‌పై 501 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల ధర రూ.99,999 నుండి ప్రారంభమై రూ.1,99,999 వరకు ఉంటుంది.

రోడ్‌స్టర్ X సిరీస్‌లో సెగ్మెంట్‌లో మొదటిసారిగా పేటెంట్ పొందిన బ్రేక్-బై-వైర్ సిస్టమ్ ఉంది. దీనికి సింగిల్ ABS అందించారు. అలాగే, ఇందులో లేటెస్ట్ MoveOS 5 సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది అడ్వాన్స్‌డ్ రీజనరేషన్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని బ్యాటరీ సిస్టమ్ IP67 సర్టిఫైడ్, అంటే ఇది వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్. ఇందులో మెరుగైన వైర్ బాండింగ్ , సర్వీసబుల్ BMS (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఉంది. ఇది మెయింటెనెన్స్ ఈజీ చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ తన రోడ్‌స్టర్ X సిరీస్‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉంది.

Updated On 16 Jun 2025 10:39 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story