మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఈ కంపెనీదే అగ్రస్థానం!

TVS : ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కేవలం 4 సంవత్సరాల్లో 10 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ఉత్పత్తిని సాధించినట్లు ప్రకటించింది. 2021లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత, తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న తమ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ తామేనని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 10 లక్షలవ మోడల్‌గా ఒక ప్రత్యేక ఎడిషన్ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌+ను విడుదల చేశారు.

టీవీఎస్ నుంచి గట్టి పోటీ

ఓలా ఎలక్ట్రిక్ తన కార్యకలాపాలను 2021లో ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణితో ప్రారంభించింది. ఇది బ్రాండ్ విజయానికి పునాది వేసింది. ఈ ఏడాది కంపెనీ తమ లైనప్‌ను విస్తరిస్తూ రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిని కూడా ప్రారంభించింది. అయితే, కంపెనీ విశ్వసనీయత సమస్యలు, అగ్ని ప్రమాదాలు, పేలవమైన సర్వీసులతో అనేక వివాదాలను కూడా ఎదుర్కొంది. వాహన్ డేటా ప్రకారం.. ఆగస్టు 2025లో టీవీఎస్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ రెండవ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది.

ఈ విజయం గురించి ఓలా ఎలక్ట్రిక్ మాట్లాడుతూ.. "మా బ్రాండ్‌ను నమ్మిన ప్రతి భారతీయుడి విజయం ఇది. గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో మేము ఈవీ ద్విచక్ర వాహనాల నాయకులుగా ఉన్నాం. మేము భారీ స్థాయిలో ఉత్పత్తిని చేసి, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారతదేశంలోనే డిజైన్ చేసి, తయారు చేయగలమని నిరూపించాం. ఈ మైలురాయి మేము ఎంత దూరం వచ్చామో సూచిస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని పేర్కొంది.

స్పెషల్ ఎడిషన్ విశేషాలు

ప్రత్యేక ఎడిషన్ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్+ మిడ్‌నైట్ బ్లూ రంగులో ఉంటుంది. ఇందులో డ్యుయల్-టోన్ సీటు, రిమ్స్, బ్యాటరీ ప్యాక్‌పై ఆకర్షణీయమైన ఎరుపు రంగును ఉపయోగించారు. ఈ మోడల్‌లో రీసైకిల్ చేసిన రాగి వ్యర్థాలతో తయారు చేసిన బ్యాడ్జ్‌లు, ఎలక్ట్రోప్లేటెడ్ బార్ ఎండ్‌లు కూడా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story