Ola in Trouble: ఓలాకు గడ్డుకాలం.. రోడ్‌స్టర్ X అయినా గట్టెక్కిస్తుందా ?

Ola in Trouble: కొన్నాళ్ల క్రితం వరకు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఏకఛత్రాధిపత్యం చెలాయించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మే 2025లో ఓలా అమ్మకాల్లో మూడో స్థానానికి పడిపోయింది. టీవీఎస్ మోటార్ (TVS Motor), బజాజ్ ఆటో (Bajaj Auto) దూసుకుపోయి మార్కెట్ లీడర్లుగా నిలిచాయి. కేవలం ఒక సంవత్సరంలో ఓలా మార్కెట్ వాటా 49శాతం నుంచి కేవలం 18శాతానికి పడిపోయింది.దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓలా కొత్త బైక్ 'రోడ్‌స్టర్ ఎక్స్' (Roadster X) పై ఉంది. ఈ బైక్ అయినా ఓలా కంపెనీని గట్టెక్కిస్తుందేమో చూడాలి.
2024 మే నెలలో ఓలా 37,388 యూనిట్లను విక్రయించింది. 2025 మే నెలలో ఈ సంఖ్య కేవలం 18,499 యూనిట్లకు పడిపోయింది. అంటే ఇది దాదాపు 60శాతం పతనం. ఇదే సమయంలో, టీవీఎస్ 24,560 యూనిట్లను విక్రయించి 24శాతం మార్కెట్ వాటాను సాధించింది. బజాజ్ ఆటో కూడా వెనుకబడకుండా 21,770 యూనిట్లతో 22శాతం వాటాను పొందింది.
ఈ పతనం కేవలం అమ్మకాల సంఖ్యకు సంబంధించినది కాదు.. వినియోగదారుల నమ్మకానికి సంబంధించింది కూడా. ఓలా క్వాలిటీ, సర్వీస్ విషయంలో వినియోగదారుల నుంచి చాలా ఫిర్యాదులను ఎదుర్కొంది. సస్పెన్షన్ ఫెయిల్ అవ్వడం, రేంజ్ విషయంలో తప్పుడు హామీలు, సర్వీస్ నెట్వర్క్ కొరత వంటి సమస్యలు ఓలా పతనానికి కారణమయ్యాయి.
ఈ పడిపోతున్న పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఓలా ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) ను విడుదల చేసింది. దీని ధర రూ.74,999 నుంచి రూ.99,999 మధ్య ఉంది. ఇది మూడు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.
రోడ్‌స్టర్ X ఫీచర్లు
* మోటార్: 11kW ఎలక్ట్రిక్ మోటార్
* టాప్ స్పీడ్: గంటకు 124 కిమీ
* రేంజ్: సింగిల్ ఛార్జ్‌పై 200 కి.మీ. వరకు (కంపెనీ చెబుతుంది)
* లేటెస్ట్ టెక్నాలజీ: క్రూజ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు
* ప్లస్ వేరియంట్: రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ వేరియంట్లో మరింత ఎక్కువ రేంజ్ లభిస్తుంది.
ఈ బైక్ కేవలం ఫీచర్లతో నిండి ఉండడమే కాకుండా ఓలాకు ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా పోటీ ఇంకా తక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఇది ఓలాకు అనుకూలంగా మారవచ్చు.అయితే, మార్కెట్లో తిరిగి పుంజుకోవడానికి కేవలం కొత్త బైక్ మాత్రమే సరిపోదు. ఓలా తన మీద వస్తున్న సమస్యలపై దృష్టి పెట్టాలి. క్వాలిటీ విషయంలో వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందాలి. స్ట్రాంగ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను నిర్మించాలి. కస్టమర్లకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి.Ola Electric Sales Drop, TVS Motor Dominance, Bajaj Auto EV, Ola Roadster X, Electric Bike India, Ola Quality Issues, EV Market Competition,
