ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు

Ola : ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్, తన కస్టమర్ల కోసం మరోసారి ముహూర్త మహోత్సవ్ ఆఫర్లను ప్రకటించింది. జనవరి 14, 2026 నుంచి ప్రారంభమైన ఈ రెండ్రోజుల ప్రత్యేక సేల్‌లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు మరియు సరికొత్త ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా తన సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఓలా ఈ ఆఫర్లను తీసుకువచ్చింది.

ఓలా ఎలక్ట్రిక్ తన పాత కస్టమర్లను, కొత్తగా ఎలక్ట్రిక్ వాహనంలోకి మారాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని అదిరిపోయే బెనిఫిట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా ప్రకటించే నిర్దిష్ట ముహూర్త సమయాల్లో కొనుగోలు చేసే వారికి లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

ఓలా తాజాగా ప్రవేశపెట్టిన ఓలా శక్తి అనేది ఇళ్ల కోసం రూపొందించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఇది పవర్ బ్యాకప్, సోలార్ స్టోరేజ్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. ఈ సేల్‌లో 1.5 kWh బ్యాటరీ సామర్థ్యం ఉన్న బేస్ వేరియంట్‌ను కేవలం రూ.10,000 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే 5.2 kWh వేరియంట్ రూ.49,999 కి, భారీ సామర్థ్యం ఉన్న 9.1 kWh వెర్షన్ రూ.99,999 కి లభిస్తున్నాయి. ఇవి సాధారణ ధరల కంటే చాలా తక్కువ.

ఓలా తన ప్రతిష్టాత్మక మోటార్ సైకిల్ Roadster X+ (9.1 kWh బ్యాటరీ) ను కేవలం రూ.1,49,999 కే ఆఫర్ చేస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక స్కూటర్ల విషయానికి వస్తే, Ola S1 Pro+ (5.2 kWh బ్యాటరీ) ని రూ.1,39,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇవి కూడా కంపెనీ కొత్తగా తయారు చేసిన 4680 భారత్ సెల్స్‌తో పనిచేస్తాయి.

పాత ఓలా స్కూటర్ వాడుతున్న వారు కొత్త టెక్నాలజీ (4680 సెల్స్) ఉన్న మోడల్‌కి మారాలనుకుంటే రూ.20,000 అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తుంది. అదేవిధంగా పెట్రోల్ వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మారాలనుకునే వారికి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. లిమిటెడ్ స్టాక్ ఉన్నందున త్వరగా డెసిషన్ తీసుకోవడం మంచిదని కంపెనీ సూచిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story