Ultraviolet : ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రజలు ఫిదా.. లాంచ్ కాకముందే భారీగా డిమాండ్
లాంచ్ కాకముందే భారీగా డిమాండ్

Ultraviolet : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. కొత్త కంపెనీలు, కొత్త మోడల్స్‌తో పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో అల్ట్రావాయిలెట్ ఆటోమోటివ్ అనే కంపెనీ వచ్చే ఏడాది భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అయితే, లాంచ్ కాకముందే ఈ కంపెనీ వాహనాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న రెండు మోడల్స్‌కు బుకింగ్స్ భారీగా పెరిగాయని కంపెనీ ప్రకటించింది.
అల్ట్రావాయిలెట్ ఆటోమోటివ్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. వారి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెసరెక్ట్ కు ఇప్పటివరకు 60,000 కు పైగా బుకింగ్స్ వచ్చాయి. అలాగే, మరో ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ బైక్ షాక్వేవ్ కు కూడా 7,000 బుకింగ్స్ లభించాయి. ఈ రెండు వాహనాల డెలివరీలు 2026 మొదటి మూడు నెలల్లో ప్రారంభం అవుతాయి.
టెసరెక్ట్ ఒక స్టైలిష్, స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అనేక కొత్త,మొదటిసారి వచ్చే ఫీచర్లతో రానుంది. కంపెనీ మొదట 50,000 మంది కస్టమర్ల కోసం దీని ప్రారంభ ధరను రూ.1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. అయితే, భారీ డిమాండ్ కారణంగా ఇప్పుడు ధర రూ.1.45లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇప్పటికే మార్చి 2025 నాటికి 50,000 బుకింగ్స్ పూర్తయ్యాయి. మిగిలిన 10,000 బుకింగ్స్ కేవలం గత మూడు నెలల్లోనే వచ్చాయి.
బేస్ మోడల్లో 3.5 kWh బ్యాటరీ, టాప్ మోడల్లో 6 kWh బ్యాటరీ ఉంటాయి. 5 kWh బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ నుండి 260 కి.మీ. వరకు వెళ్తుంది. ముందు, వెనుక రాడార్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్‌తో కూడిన రియర్ వ్యూ మిర్రర్స్, డాష్‌క్యామ్ ఉన్నాయి. టాప్ స్పీడ్ గంటకు 125 కి.మీ.ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, 4-లెవెల్ రీజెన్ బ్రేకింగ్ , హిల్ హోల్డ్ ఫంక్షన్ ఉన్నాయి. అల్ట్రావాయిలెట్ షాక్వేవ్ ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ బైక్. ఈ బైక్ ధర రూ.1.75 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది.
14.5 బిహెచ్పి పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 4 kWh బ్యాటరీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది.0 నుండి 60 కి.మీ. వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 120 కి.మీ.ఆల్-ఎల్ఈడీ లైటింగ్, బలమైన స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్ , 21 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక స్పోక్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (స్విచ్చబుల్), 4-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్, 6-లెవెల్ రీజెనరేషన్ వంటివి ఉన్నాయి. ఈ రెండు వాహనాలు భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో హై-టెక్,మంచి పనితీరును అందించే ఆప్షన్లను జోడిస్తాయి.
