MG Comet EV : దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 క్రేజీ విషయాలివే
కొనేముందు తెలుసుకోవాల్సిన 5 క్రేజీ విషయాలివే

MG Comet EV : మెట్రో సిటీలలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్‌లు, ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యులు విసిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో నగరవాసుల ఇబ్బందులను తీర్చడానికి మార్కెట్లోకి వచ్చిన ఒక బుజ్జి కారు ఆటోమొబైల్ రంగాన్ని ఆకర్షిస్తోంది. అదే జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాకు చెందిన ఎంజీ కామెట్ ఈవీ. భారతదేశంలోనే అత్యంత కాంపాక్ట్, క్యూట్ లుకింగ్ ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటి. ఇరుకైన గల్లీల్లో, ట్రాఫిక్ రోడ్లపై దీనిని నడపడం చాలా సులభం. మీరు కూడా ఈ సరికొత్త సిటీ ఈవీని సొంతం చేసుకోవాలనుకుంటే, దీనికి సంబంధించిన 5 ముఖ్యమైన ముచ్చట్లు కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే.
1. అదిరిపోయే ప్రైస్ ప్లాన్..
సాధారణంగా ఎంజీ కామెట్ ఈవీ రెగ్యులర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.62 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. అయితే, కస్టమర్ల బడ్జెట్ భారాన్ని తగ్గించడం కోసం ఎంజీ సంస్థ ఒక విప్లవాత్మకమైన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ అదిరిపోయే స్కీమ్ కింద కారు అసలు ధర కేవలం రూ. 4.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. కాకపోతే, ఇందులో బ్యాటరీని మనం అద్దెకు తీసుకున్నట్లు లెక్క. దీనికోసం మనం కారును నడిపే ప్రతి కిలోమీటరుకు రూ.3.20 చొప్పున బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఈవీ కారు కొనాలనుకునే వారికి ఇది ఒక బంపర్ ఆఫర్.
2. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిమీ రేంజ్
ఈ చిన్న కారులో ఎంజీ సంస్థ పవర్ఫుల్ 17.3kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 41.43 bhp పవర్, 110 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒకసారి ఈ కారును ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది. అంటే సిటీ పరిధిలో ఆఫీసులకు వెళ్లేవారికి వారం రోజులకు పైగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే రాదు. సిటీ ప్రయాణాలకు ఈ మైలేజ్ రేంజ్ అల్టిమేట్‌గా సరిపోతుంది.
3. చిన్న సందులో కూడా దూరిపోతుంది
సైజ్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీని పొడవు 2,974 మిమీ, వెడల్పు 1,505 మిమీ, ఎత్తు 1,640 మిమీగా ఉంది. అలాగే దీని వీల్‌బేస్ 2,010 మిమీ. ఈ కారులోని అసలైన మ్యాజిక్ ఏంటంటే, దీని టర్నింగ్ రేడియస్ కేవలం 4.2 మీటర్లు మాత్రమే..అంటే ఎంతటి ఇరుకైన సందుల్లోనైనా, బిజీగా ఉండే మార్కెట్ రోడ్లలోనైనా బైక్ తిప్పినంత ఈజీగా ఈ కారును యూ-టర్న్ తిప్పేయొచ్చు. పార్కింగ్ ప్లేస్ కోసం అస్సలు కష్టపడాల్సిన పనే లేదు.
4. ఫ్యూచరిస్టిక్ బాక్సీ డిజైన్!
ఎంజీ కామెట్ ఈవీ చూడటానికి చాలా విభిన్నంగా, ఒక రోబోటిక్ బాక్సీ డిజైన్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ లుక్ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. కారు ముందు భాగంలో ఎండ్-టు-ఎండ్ కనెక్ట్ అయ్యేలా ఎల్‌ఈడీ లైట్‌బార్‌ను ఇచ్చారు. దీనిని కంపెనీ ఎక్స్‌టెండెడ్ హారిజన్ అని పిలుస్తుంది. దీని ఛార్జింగ్ పోర్ట్ కూడా కారు ముందు భాగంలో ఉండే ఎంజీ లోగో కిందనే క్లాస్‌గా అమర్చారు. కారుకు అందాన్ని ఇచ్చేలా 12 ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఇచ్చారు.
5. లోపల థియేటర్ లాంటి స్క్రీన్స్
కారు బయట చిన్నగా ఉన్నప్పటికీ, లోపలి కేబిన్ మాత్రం వైట్ అండ్ గ్రే కలర్ థీమ్‌తో చాలా లగ్జరీగా, విశాలంగా ఉంటుంది. డాష్‌బోర్డ్‌పై లగ్జరీ కార్ల తరహాలో ఏకంగా రెండు 10.24 ఇంచుల భారీ డిజిటల్ డిస్‌ప్లేలను అమర్చారు. ఇందులో ఒకటి డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పనిచేస్తుంది. ఇవి కాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, స్మార్ట్ రియర్ పార్కింగ్ కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫోర్-స్పీకర్ ఆడియో సిస్టమ్, అదిరిపోయే లెదరెట్ సీట్లను స్టాండర్డ్‌గా అందించారు. టాటా టియాగో ఈవీకి గట్టి పోటీ ఇస్తున్న ఈ కారు సిటీవాసులకు ఒక పవర్‌ఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఛాయిస్.

