అమ్మకాల్లో అదరగొట్టిన రూ. 6 లక్షల SUV

Nissan Magnite : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో నిస్సాన్ మోటార్ తన మాగ్నైట్ (Magnite)తో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2020లో విడుదలైనప్పటి నుండి ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV దేశీయంగా, అంతర్జాతీయంగా 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. నిస్సాన్ అనుసరిస్తున్న 'వన్ కార్, వన్ వరల్డ్' అనే తత్వంతో భారతదేశంలో తయారైన మాగ్నైట్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతూ అంతర్జాతీయ మార్కెట్లో కూడా విశేషమైన పనితీరును కనబరుస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్ భారతదేశపు సబ్-4 మీటర్ SUV విభాగంలో సరసమైన ధరలో, కానీ స్టైలిష్‌గా ఉండే వాహనంగా నిలిచింది. ఈ కారు అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇది బడ్జెట్‌లో పవర్ ఫుల్ SUV కోసం చూస్తున్న వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.14 లక్షల నుండి రూ.11.92 లక్షల వరకు ఉంటుంది. ఇది XE, XL, XV, XV Premium వంటి అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా లభిస్తాయి. ఇటీవల కంపెనీ దీని CNG వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ఇది మైలేజ్ ప్రియులను మరింత ఆకర్షిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్ రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. అవి 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 72PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 100PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టర్బో వెర్షన్‌లో మాన్యువల్‌తో పాటు CVT (కంటిన్యుయస్‌లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఎంపిక కూడా లభిస్తుంది. మైలేజ్ విషయానికొస్తే నిస్సాన్ మాగ్నైట్ పెట్రోల్ మోడల్‌లో 17.9 నుండి 19.9 kmpl మైలేజ్ వస్తుంది.CNG మోడల్‌లో 24 km/kg మైలేజ్ లభిస్తుంది.

మాగ్నైట్ డిజైన్ మస్కులర్, బోల్డ్ ఉంటుంది. దీని పెద్ద గ్రిల్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (డేటైమ్ రన్నింగ్ లైట్స్), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. దీని ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ (205 మిమీ), రూఫ్ రెయిల్స్ దీనికి పూర్తి SUV ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, 336 లీటర్ల బూట్ స్పేస్ ఎక్కువ సామాన్లను తీసుకెళ్లడానికి లేదా సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి. ఈ అన్ని ఫీచర్లు, సరసమైన ధరతో కలిసి నిస్సాన్ మాగ్నైట్‌ను సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలబెట్టాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story