Renault Duster: రెనాల్ట్ డస్టర్ లవర్లకు బంపర్ ఆఫర్.. ఇప్పుడు కొటే ఏకంగా 2.10 లక్షలు ఆదా
ఏకంగా 2.10 లక్షలు ఆదా

Renault Duster: భారతీయ మార్కెట్లో సరికొత్త హంగులతో పునరాగమనం చేసిన ప్రముఖ ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. నవంబర్ 2026 నెలలో ఈ పాపులర్ ఎస్‌యూవీపై కంపెనీ ఏకంగా రూ.2.10 లక్షల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. హ్యుందాయ్ క్రెటా వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ వాహనంపై కంపెనీ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ అలాగే లాయల్టీ బోనస్‌లను ప్రకటిచింది. ఈ ఆఫర్లు నవంబర్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ సంస్థ వెల్లడించింది.
వేరియంట్ల వారీగా లభించే ఆఫర్లు
నవంబర్ నెలలో డస్టర్ టాప్ వేరియంట్లైన టెక్నోప్లస్ అలాగే ఐకానిక్ మోడళ్లపై రూ.50,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ క్యాష్ ఆఫర్ వద్దు అనుకుంటే కేవలం 4.99 శాతం వడ్డీ రేటుతో ఆకర్షణీయమైన కార్ లోన్ సౌకర్యాన్ని కూడా ఎంచుకోవచ్చు. వీటితో పాటు పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.1.5 లక్షల వరకు బోనస్, రెనాల్ట్ రిలైవ్ కార్యక్రమం కింద స్క్రాపేజ్ బోనస్‌గా రూ.25,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇప్పటికే రెనాల్ట్ కస్టమర్లుగా ఉన్నవారికి రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ కూడా వర్తిస్తుంది.
ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు
కొత్త తరహా డస్టర్ ఎస్‌యూవీ అత్యంత రగ్గడ్ అలాగే మోడర్న్ లుక్‌తో రూపుదిద్దుకుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ గ్రిల్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు 212 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల చెత్త రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించవచ్చు. కేబిన్ లోపల గూగుల్ బిల్ట్-ఇన్ సపోర్ట్ కలిగిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 17 అడ్వాన్స్‌డ్ ఫీచర్లు గల లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీని పొందుపరిచారు.
శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, అద్భుతమైన మైలేజ్
ఈ ఎస్‌యూవీలో వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో లభించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో పాటు బలమైన హైబ్రిడ్ వెర్షన్ కూడా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే హైబ్రిడ్ మోడల్ ఏకంగా 29 కిమీ/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుందని ARAI ధృవీకరించింది. శక్తివంతమైన పనితీరు, అత్యధిక మైలేజ్ అలాగే భారీ డిస్కౌంట్ల కలయికతో వస్తున్న ఈ కొత్త డస్టర్ కారు ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

