ఏకంగా రూ.80,000 ఆదా చేసే గోల్డెన్ ఛాన్స్

Renault : కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మార్చి నెల అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, మార్చి 2026 నెలకు గానూ తన పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో పాత స్టాక్‌ను క్లియర్ చేసే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి వినియోగదారులు ఏకంగా రూ.80,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్పెషల్ కార్పోరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ట్రైబర్, కైగర్‌లపై భారీ డిస్కౌంట్

మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ ట్రైబర్, స్టైలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ మోడళ్లపై రెనాల్ట్ అత్యధికంగా రూ.80,000 వరకు తగ్గింపును ఇస్తోంది. ఇందులో రూ.30,000 నేరుగా నగదు తగ్గింపు లభిస్తుండగా, పాత కారును ఎక్స్ఛేంజ్ చేసే వారికి అదనంగా మరో రూ.50,000 వరకు బోనస్ లభిస్తుంది. ఈ భారీ తగ్గింపుతో ట్రైబర్ ఇప్పుడు మారుతీ అర్టిగాకు, కైగర్ మోడల్ టాటా పంచ్,హ్యుందాయ్ ఎక్స్టర్‌లకు గట్టి పోటీనిస్తోంది. ఈ ఆఫర్లు ఆర్‌ఎక్స్‌ఈ నుంచి ఆర్‌ఎక్స్‌జెడ్ వరకు అన్ని ప్రధాన వేరియంట్లపై వర్తిస్తాయి.

మరింత అందుబాటులోకి క్విడ్

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి పేరున్న రెనాల్ట్ క్విడ్ పై ఈ నెలలో రూ.70,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.20,000, కంపెనీ ప్రత్యేక స్కీమ్ కింద మరో రూ.40,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. క్విడ్ క్లైంబర్ వంటి స్టైలిష్ వేరియంట్లకు ఈ ఆఫర్ పెద్ద ప్లస్ పాయింట్. రోజూ ఆఫీస్ ప్రయాణాలకు చిన్న కారు కావాలనుకునే వారికి మారుతీ ఆల్టో, ఎస్-ప్రెస్సో కంటే క్విడ్ ఇప్పుడు చౌకైన, ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది.

కొత్త డస్టర్ కోసం ఎదురుచూపులు

మరోవైపు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీ కోసం రెనాల్ట్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. ఆర్-పాస్ ప్రోగ్రామ్ ద్వారా కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కస్టమర్లు తమ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త డస్టర్ పవర్‌ఫుల్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రాబోతోంది. ఇది హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్ వంటి కార్లకు సవాల్ విసరనుంది. భవిష్యత్తులో ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story