Rolls-Royce Boat Tail : ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులు లగ్జరీ కార్ల పట్ల చూపించే క్రేజ్ అంతా ఇంతా కాదు.

Rolls-Royce Boat Tail : ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులు లగ్జరీ కార్ల పట్ల చూపించే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ లగ్జరీలో శిఖరాగ్రాన నిలిచే కంపెనీ రోల్స్ రాయిస్. ఈ కంపెనీ తయారు చేసిన కార్లలో ఒక మోడల్ అత్యంత ప్రత్యేకమైనది.. ఖరీదైనది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన ఈ కారు కేవలం మూడు యూనిట్లు మాత్రమే తయారు చేయబడ్డాయి. ఈ అద్భుతమైన కారు పేరు ఏమిటి? దాని ధర ఎంత? ప్రపంచంలో ఈ కారును సొంతం చేసుకున్న ఆ ముగ్గురు అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ బోట్ టెయిల్‎ను తయారు చేసింది.


ఈ కారు ధర 28 మిలియన్ USD డాలర్లు, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.232 కోట్లకు సమానం. ఈ ధర కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన కార్లలో ఒకటిగా నిలిచింది. రోల్స్ రాయిస్ ఈ కారును కేవలం మూడు యూనిట్లు మాత్రమే తయారు చేసింది. ఈ మూడు కార్లను కూడా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా పూర్తి కస్టమైజేషన్‌తో రూపొందించారు. ఈ కారు పేరుకు తగినట్లుగానే దాని డిజైన్, అంతర్గత ఫీచర్లలో ప్రత్యేకతను కలిగి ఉంది.

రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కారుకు ఒక క్లాసిక్ నౌక (Yatch) ఆకారాన్ని పోలిన డిజైన్‌ను ఇచ్చారు. ఇది నాలుగు సీట్ల కారు. ఈ కారులో రెండు రిఫ్రిజిరేటర్లు అమర్చబడ్డాయి. వాటిలో ఒకటి ప్రత్యేకంగా షాంపైన్ ఉంచడానికి అనుగుణంగా తయారు చేయబడింది. 1910లో కంపెనీ రూపొందించిన పాత కారుకు కొత్త రూపాన్ని ఇస్తూ ఈ మోడల్‌ను రూపొందించారు.

ప్రపంచంలోనే కేవలం మూడు యూనిట్లు మాత్రమే ఉన్న ఈ కారును సొంతం చేసుకున్న ముగ్గురు యజమానులు వీరే. ఈ మూడు కార్లలో ఒక యూనిట్‌ను ప్రముఖ బిలియనీర్ రాపర్ జే-జెడ్, ఆయన భార్య బియాన్స్ కొనుగోలు చేశారు. రెండవ మోడల్ యజమాని పేరు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, అతను ముత్యాల పరిశ్రమకు చెందిన వ్యాపారవేత్త అని పుకార్లు ఉన్నాయి. మూడవ కారు యజమాని అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు మౌరో ఇకార్డీ. ఈ కారు క్లాసిక్ యాచ్ డిజైన్‌తో ప్రేరణ పొంది, ప్రత్యేకమైన సముద్రపు నీలి రంగు ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది.


PolitEnt Main

PolitEnt Main

Next Story