Royal Enfield : రెట్రో బైక్ ప్రేమికులకు పూనకాలే.. మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650
మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650

Royal Enfield : భారతీయ మోటార్ సైకిల్ రంగంలో తనకంటూ ప్రత్యేక చరిత్ర ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, తన ఐకానిక్ బ్రాండ్ పేరుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పాత తరం బుల్లెట్ వింటేజ్ లుక్‌ను కాపాడుకుంటూనే, నెక్స్ట్ లెవెల్ మోడరన్ టెక్నాలజీతో ఈ సరికొత్త పవర్‌ఫుల్ బైక్ దూసుకొచ్చింది.
క్లాసిక్ డిజైన్ - పవర్‌ఫుల్ ఇంజన్
లుక్ పరంగా ఇందులో సాంప్రదాయక రెట్రో ఎలిమెంట్స్ జత చేశారు. దీని ఫ్యూయల్ ట్యాంక్‌పై చేతితో పెయింట్ చేసిన సన్నని గీతలు, వింటేజ్ మెటల్ బ్యాజింగ్, క్లాసిక్ చతురస్రాకార (స్క్వేర్) రియర్ ఫెండర్ దీనికి గంభీరమైన రూపాన్ని ఇస్తాయి. ఇక ఇంజన్ విషయానికొస్తే.. ఇందులో నమ్మకమైన 648cc ఎయిర్/ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 47 హార్స్‌పవర్ (hp), 52.3 Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్మూత్ రైడింగ్ కోసం అడ్వాన్స్డ్ స్లిప్-అండ్-अసిస్ట్ క్లచ్‌ను జోడించారు.
రైడింగ్ కంఫర్ట్ - అడ్వాన్స్డ్ హార్డ్‌వేర్
లాంగ్ రైడ్స్ వెళ్లేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా సింగిల్-పీస్ స్టెప్ సీట్ డిజైన్ చేశారు. ఇది రైడర్‌తో పాటు వెనుక కూర్చునే వారికి కూడా అద్భుతమైన సిట్టింగ్ కంఫర్ట్‌ను అందిస్తుంది. హార్డ్‌వేర్ పరంగా ముందు భాగంలో 120 మిమీ ట్రావెల్ గల ప్రీమియం షోవా టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక 90 మిమీ ట్రావెల్ గల ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. క్లాసిక్ వింటేజ్ లుక్ కోసం ముందర 19-ఇంచులు, వెనుక 18-ఇంచుల వైర్-స్పోక్ వీల్స్‌ను ట్యూబ్-టైప్ టైర్లతో జత చేశారు.
మోడరన్ ఫీచర్లు - ధర వివరాలు
ఈ బైక్‌లో డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు టర్న్-బై-టర్న్ డైరెక్షన్స్ చూపించే ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, బ్రేకింగ్ సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS) ఫీచర్లను అందించారు. భారత మార్కెట్లో బుల్లెట్ 650 సింగిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.65 లక్షలుగా ఉంది. ఇది కానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

